చిలుకూరు మండల స్థాయి బాల బాలికల క్రీడోత్సవాలు

byసూర్య | Sat, Sep 21, 2024, 01:35 PM

సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలోని చిలుకూరు మండలం చిలుకూరు గ్రామంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బాలబాలికలకు మండల స్థాయిలో క్రీడోత్సవాలు నిర్వహిస్తున్నారు. చిలుకూరు తాసిల్దార్ ధ్రువ కుమార్, ఎంపీడీవో గిరిబాబు మండల స్థాయి క్రీడోత్సవాలను ప్రారంభించారు. స్కూల్ గేమ్స్  ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి హాజీమ్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, అండర్ 14 ,అండర్ 17 బాల బాలికలకు 20, 21వ తారీకు రెండు రోజులు మొదటి రోజు బాలురులకు రెండో రోజు బాలికలకు క్రీడలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ క్రీడోత్సవoలో సెలెక్ట్ అయిన క్రీడాకారులను డివిజన స్థాయికి పంపిస్తామని తెలియజేశారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులకు ఈ క్రీడోత్సవాల నిర్వహిస్తున్నామని తెలియజేశారు.
విద్యార్థులు చదువుతోపాటు, క్రీడలలో నైపుణ్యత సాధించాలని అన్నారు. విద్యార్థులు మంచి నడవడిక, సమాజ సేవ, భక్తిశ్రద్ధలతో ఉండాలని తల్లిదండ్రులకు మంచి పేరు, మండలానికి, దేశానికి గౌరవప్రదమైన ఉద్యోగ అభివృద్ధి సాధించాలని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం కరుణాకర్ రెడ్డి, పి ఈ టి లు సీతారామరెడ్డి, బ్రహ్మారెడ్డి, ప్రకాష్ ,శోభన్ బాబు, రేణుక మేడం,స్కూలు ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

గురజాడ అప్పారావు జయంతి కార్యక్రమం Sat, Sep 21, 2024, 03:51 PM
రాహుల్ వ్యాఖ్యలపై నిరసన Sat, Sep 21, 2024, 03:47 PM
పేదలకు వరం సీఎం సహాయనిధి Sat, Sep 21, 2024, 03:42 PM
ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేసి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తాం Sat, Sep 21, 2024, 03:37 PM
దామ్రాజపల్లిలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన Sat, Sep 21, 2024, 03:34 PM