హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్.. రెండ్రోజులు ట్రాఫిక్ ఆంక్షలు

byసూర్య | Mon, Sep 16, 2024, 07:59 PM

హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్. నగర పరిధిలో గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా నిర్వహించేందుకు గాను ఈ నెల 17, 18 తేదీల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించినట్లు సిటీ పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ వెల్లడించారు.


బాలాపూర్‌ నుంచి గుర్రం చెరువు ట్యాంక్‌పై కట్టమైసమ్మ ఆలయం వద్ద ప్రధాన ఊరేగింపు హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోకి ప్రవేశిస్తుందన్నారు. కేశవగిరి, చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్‌ (లెఫ్ట్ టర్న్), ఎంబీఎన్ఆర్ ఎక్స్‌ రోడ్, ఫలక్‌నుమా రైల్వే ఓవర్‌ బ్రిడ్జ్, ఆలియాబాద్, చార్మినార్, మదీనా, అఫ్జల్‌గంజ్, MJ మార్కెట్, అబిడ్స్‌ ఎక్స్‌ రోడ్, బషీర్‌బాగ్, లిబర్టీ జంక్షన్, ఎన్టీఆర్‌ మార్గ్, పీవీఎన్‌ఆర్‌ మార్గ్‌ అంబేడ్కర్‌ విగ్రహం వైపు శోభాయాత్ర సాగుతుందని చెప్పారు. వాహనాదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని కోరారు.


సికింద్రాబాద్‌ నుంచి ఊరేగింపుగా వచ్చే గణేష్ శోభాయాత్రం వాహనాలను సంగీత్‌ థియేటర్, ప్యాట్నీ, ప్యారడైజ్‌ జంక్షన్, ఎంజీ రోడ్డు, కర్బలా మైదాన్, ట్యాంక్‌బండ్‌ మీదుగా నెక్లెస్‌ రోడ్డుకు మళ్లిస్తారు. చిలకలగూడ కూడలి నుంచి గాంధీ ఆసుపత్రి, ఆర్టీసీ ఎక్స్ రోడ్, నారాయణగూడ ప్లైఓవర్, వై.జంక్షన్, హిమాయత్‌నగర్‌ నుంచి లిబర్టీ వైపు మళ్లిస్తారు.


దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి వచ్చే శోభాయాత్రలను, ఐఎస్‌ సదన్, సైదాబాద్, చంచల్‌గూడ నుంచి వచ్చే ఊరేగింపుతో నల్గొండ ఎక్స్‌ రోడ్డులో కలుస్తోంది. అక్కడి నుంచి మూసారాంబాగ్‌, అంబర్‌పేట్‌ వైపు వెళ్తాయి. తార్నాక వైపు వచ్చే విగ్రహాలు ఓయూ దూర విద్యాకేంద్రం రోడ్డు, అడిక్‌మెట్‌ వైపు వెళ్లి విద్యానగర్‌ మీదుగా ఫీవర్‌ ఆసుపత్రి వద్దకు ఊరేగింపు చేరుతుందని చెప్పారు.


ఉప్పల్‌ నుంచి రామంతాపూర్, శ్రీరమణ జంక్షన్, ఛే నంబరు, తిలక్‌నగర్, విద్యానగర్‌ జంక్షన్, ఫీవర్‌ ఆసుపత్రి, బర్కత్‌పుర జంక్షన్ మీదుగా వెళ్లి నారాయణగూడ వైఎంసీఏ కూడలికి చేరుకుంది. ఈ విగ్రహాలు ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు నుంచే వచ్చే ఊరేగింపుతో కలపనున్నారు. ఇక టోలిచౌకి, రేతిబౌలి, మోహిదీపట్నం వైపు నుంచి వచ్చే విగ్రహాలను మాసబ్‌ట్యాంక్, అయోధ్య జంక్షన్, నిరంకారి భవన్, ద్వారకా హోటల్‌ జంక్షన్, ఇక్బాల్‌ మినార్‌ మీదుగా ఎన్టీఆర్‌ మార్గ్‌కు చేరుకుంటుందని చెప్పారు.


టప్పాచబుత్ర, ఆసిఫ్‌నగర్‌ ప్రాంతాల నుంచి వచ్చే విగ్రహాలు సీతారాంబాగ్, వోల్గా హోటల్‌ ఎక్స్‌రోడ్, గోషా మహల్, మాలకుంట కూడలి మీదుగా వెళ్లి ఎంజేఎం వద్ద ప్రధాన ఊరేగింపులో కలవనున్నాయి. ఎర్రగడ్డ నుంచి వచ్చే శోభాయాత్రలు ఎస్‌ఆర్‌ నగర్, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్‌ మీదుగా మోహిదీపట్నం నుంచి వచ్చే ఊరేగింపు నిరంకారి భవన్‌ వద్ద చేరి, ఎన్టీఆర్‌ మార్గ్‌ వరకు చేర్చనున్నారు. ఈ రూట్లలో ఈనెల 17,18 తేదీల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని వాహనదారులు సహకరించాలని సీపీ కోరారు.


Latest News
 

తెలంగాణ ఆర్‌టీసీ బ‌స్సుల్లో క్యూఆర్ కోడ్ చెల్లింపులు Fri, Sep 20, 2024, 03:20 PM
సీఎంఆర్ గడువులోగా ఇవ్వాలి Fri, Sep 20, 2024, 03:20 PM
ప్రజా పాలనలో ప్రజల కు ఇబ్బందులు లేకుండా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణి Fri, Sep 20, 2024, 03:17 PM
తిరుమలలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరం : బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు Fri, Sep 20, 2024, 03:17 PM
స్థానిక సంస్థల ఎన్నికల ఓటర్ జాబితా పరిశీలన Fri, Sep 20, 2024, 03:13 PM