ఏకంగా అంబులెన్స్‌లోనే, టైర్ పంక్చర్‌ కావడంతో గుట్టురట్టు

byసూర్య | Mon, Sep 16, 2024, 07:52 PM

డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల అక్రమ రవాణాపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ప్రత్యేకంగా నార్కోటిక్ విభాగాన్ని ఏర్పాటు చేసి దాడులు చేస్తున్నారు. అయినా మత్తు పదార్థాల అక్రమ రవాణా ఆగటం లేదు. గంజాయి సప్లయ్ చేసే స్మగ్లర్లు కొత్తదారులు వెతుక్కుంటున్నారు. టాలీవుడ్ మూవీ పుష్పలో చూపించినట్లుగా చాలా తెలివిగా అక్రమ మార్గంలో గంజాయిని రవాణా చేస్తున్నారు. తాజాగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో కోట్ల రూపాయల విలువచేసే గంజాయి పట్టుబడింది. అంబులెన్స్‌లో ఒడిశా నుంచి తమిళనాడుకు గంజాయి తరలిస్తుండగా అనుకోని రీతిలో స్మగ్లర్లు పట్టుబడ్డారు.


మార్గమధ్యలో అంబులెన్స్ టైర్ పంక్చర్ కావంటతో కొందరు స్థానిక యువకులు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. టైర్ మార్చే క్రమంలో ఓ యువకుడు అంబులెన్స్ డోర్ ఓపెన్ చేసి చూశాడు. అందులో అనుమానస్పదంగా ప్యాకింగ్ చేసిన గంజాయి కనిపించింది. ఎక్కడికెళ్తున్నారని డ్రైవర్‌ను ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానం చెప్పాడు. దీంతో అనుమానం వ్యక్తం చేసిన స్థానిక యువకులు ఆలస్యం చేయకుండా వారిని మాటల్లో పెట్టి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు అంబులెన్స్‌ను చెక్ చేయగా.. అందులో సుమారు 4 క్వింటాళ్ల గంజాయి ఉంది. దీంతో డ్రైవర్‌తో పాటుగా మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.2 కోట్లు ఉంటుందని అంచనా.


ఆంధ్రా ఒడిశా బార్డర్ నుంచి గత కొన్నేళ్లుగా గంజాయి అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. అక్కడి నుంచి ట్రైన్లు, ప్రైవేట్ వాహనాల్లో వివిధ ప్రాంతాలకు గంజాయిని తరలిస్తున్నారు. అడవి మార్గం గుండా రవాణా చేస్తే ఎవరికీ అనుమానం రాదని భావించి ఏజెన్సీ ప్రాంతాల నుంచి ప్రధాన పట్టణాలకు స్మగ్లర్లు ఈ గంజాయిని చేరవేస్తున్నారు. ఏపీలోని విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లోని అడవి మార్గాల్లో సీక్రెట్‌గా గంజాయిని తరలిస్తున్నారు. చాలా సార్లు స్మగ్లర్లను పోలీసులు పట్టుకున్నారు కూడా. ఈసారి ఎవరికీ అనుమానం రాకుండా అంబులెన్స్‌లో తరలించేందుకు ప్లాన్ చేయగా.. టైర్ పంచర్ కావటంతో వారి గుట్టు రట్టయింది.


Latest News
 

భజన పేరుతో.. మిరప తోటలోనే యవ్వారం పెట్టేశాడు Fri, Sep 20, 2024, 10:00 PM
తెలంగాణలో మరో జూపార్క్ ,,,ఫోర్త్ సిటీలో ఏర్పాటు Fri, Sep 20, 2024, 09:56 PM
దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిపై.. హెచ్‌ఎండీకే హైకోర్టు నోటీసులు జారీ Fri, Sep 20, 2024, 08:34 PM
పాస్ పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటు చేయించాలని వినతి Fri, Sep 20, 2024, 08:30 PM
ఓఆర్ఆర్‌పై కొత్తగా మరో మూడు ఇంటర్‌చేంజ్‌లు.. ఆ ప్రాంతాల్లో ఏర్పాటు Fri, Sep 20, 2024, 08:19 PM