హైదరాబాద్‌లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ,,,రహస్యంగా నడిపిస్తున్న ఫ్యాక్టరీపై దాడి

byసూర్య | Fri, Jul 12, 2024, 07:30 PM

మార్కెట్‌లో ఏది కొనేటట్టు లేదు.. ఏదీ తినేటట్టు లేదు.. అన్నట్టుగా తయారైంది పరిస్థితి. ఏది నకిలీనో.. ఏది నిజమో.. తెలుసుకోలేక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రతిదానికి నకిలీ తయారు చేస్తూ.. ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు. ముఖ్యంగా ఆహారపదార్థాల్లో వాడే అన్నింటినీ కల్తీ చేసి మార్కెట్‌లో యథేచ్ఛగా అమ్మేస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగి యుద్ధం ప్రకటించారు. ఓవైపు.. హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలపై దాడులు నిర్వహిస్తూనే.. మరోవైపు అనుమతులు లేకుండా నకిలీ పదార్థాలను తయారు చేస్తున్నవారిపైనా కొరడా ఝళిపిస్తున్నారు. అయినప్పటికీ.. కేటుగాళ్లు తమ దందాలు ఆపటంలేదు.


ఈ క్రమంలోనే.. రహస్యంగా నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను తయారు చేస్తూ.. మార్కెట్‌లో యథేచ్ఛగా అమ్మేస్తున్నారు. అటు హోటళ్లు, రెస్టారెంట్లకు కూడా ఇదే అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను సరఫరా చేస్తున్నారు. హైదరాబాద్‌ బుద్వేల్‌లోని గ్రీన్ సిటీలో రహస్యంగా.. అనుమతులు లేకుండా తయారు చేస్తున్న కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్యాక్టరీపై సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో.. సుమారు రూ.15 లక్షల విలువైన 7.3 టన్నుల అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు.


అమీర్ నిజాన్ అనే వ్యక్తి... అప్న ఎంటర్ ప్రెజెస్ పేరుతో ఈ ఫ్యాక్టరీని నిర్వహిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. విశ్వసనీయ సమాచారం అందటంతో.. ఫ్యాక్టరీకి చేరుకున్న ఎస్వోటీ పోలీసులు.. కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు తయారీలో అక్రమంగా సింథటిక్ కలర్స్, యాసిడ్స్, కెమికల్ వాటర్ వాడుతున్నట్లు పోలీసులు నిర్ధారించారు. శాంపిల్స్ తీసుకుని ల్యాబ్‌కు పంపించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


ఇప్పటికే.. ఫుడ్ సేఫ్టీ అధికారులు నగరంలోని సాధారణ హోటళ్ల దగ్గరి నుంచి మొదలు పేరు మోసిన రెస్టారెంట్లు, బేకరీలు, స్వీట్ హౌస్‌లపై దాడులు చేస్తున్నారు. ఈ దాడుల్లో విస్తుపోయే సన్నివేశాలు వెలుగు చూడటంతో.. ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రుచి, శుచికి మారుపేరుగా చెప్పుకునే పెద్ద పెద్ద హోటళ్లలో కూడా షాకింగ్ సన్నివేశాలు కనిపిస్తుండటం ఆందోళనకరంగా ఉంది. ఇదిలా ఉందంటే.. ఇప్పుడు ఇలా నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటూ, కల్తీ నూనెలంటూ దుకాణాల్లో యథేచ్చగా అమ్ముతుంటే.. ఇక ఏవి కొనాలి.. ఏవి తినాలన్నది తేల్చుకోలేక తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు జనాలు.


Latest News
 

తెలంగాణ బిజేపీ ఛీప్ గా ఆయన పేరు ఖరారు..? Thu, Oct 31, 2024, 04:53 PM
సైబరాబాద్ సీపీ అవినాష్ మోహంతి కీలక ప్రకటన Thu, Oct 31, 2024, 04:49 PM
స్టార్ క్యాంపెయినర్ గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క Thu, Oct 31, 2024, 04:45 PM
మధిర మండలంలో పర్యటించిన సీపీఎం పార్టీ రాష్ట్ర నాయకులు Thu, Oct 31, 2024, 04:44 PM
దేశానికి ఇందిరాగాంధీ సేవలు మరువలేనివి: కాంగ్రెస్ Thu, Oct 31, 2024, 04:43 PM