byసూర్య | Fri, Jul 12, 2024, 04:23 PM
కర్నూల్ జిల్లా ముచ్చుమరి గ్రామంలో ఎనిమిదేళ్ళ చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం వాల్మీకి సంఘం నాయకులు నారాయణపేట తహసిల్దార్ రాణా ప్రతాప్ సింగ్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్ మాట్లాడుతూ. చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులకు ఉరి శిక్ష విధించాలని అన్నారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.