byసూర్య | Fri, Jul 12, 2024, 04:19 PM
ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు అటానమస్ హోదా దక్కిందని కళాశాల ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే మొట్టమొదట ఈ హోదా పొందిన ఘనతను సొంతం చేసుకుంది. దీంతో ప్రతి ఏటా రూ. 12 లక్షల నిధులు(యూజీసీ), రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు, ప్రతి విభాగం బలోపేతం, నూతన కోర్సులు, క్షేత్ర పర్యటనలపై దృష్టి కేంద్రీకరించి ఉద్యోగావకాశాలు పెంచి మహిళా సాధికారతకు పెద్ద పీట వేయనున్నారు.