byసూర్య | Fri, Jul 12, 2024, 04:17 PM
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని వీరభద్రస్వామి దేవాలయంలో గురువారం అర్థరాత్రి దొంగలు పడ్డారు. హుండీలోని నగదు, అమ్మవారి మెడలో మంగళ సూత్రం, వెండి వస్తువులు అపహరణకు గురైనట్టు పూజారి తెలిపారు. కాగ వీరభద్ర స్వామి గుడిలో దొంగతనం కావడం ఇది నాలుగవ సారి. శుక్రవారం ఘటనా స్థలాన్ని పట్టణ ఎస్ఐ శ్రీనివాస్ పరిశీలించారు. క్లూస్ టీమ్ దేవాలయ పరిసరాలను క్షుణ్ణంగా పరీక్షిస్తున్నారు.