byసూర్య | Fri, Jul 12, 2024, 04:16 PM
కాంగ్రెస్ ప్రభుత్వం నిజమైన రైతులకే పెట్టుబడి సాయాన్ని అందిస్తామంటూ గ్రామస్థాయిలో రైతుల అభిప్రాయాలను సేకరించి వారి సూచన మేరకే ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటిస్తుందంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం వనపర్తి జిల్లా కలెక్టరేట్ లో రైతుల నుండి అభిప్రాయ సేకరణ కోసం ఏర్పాటు చేసి, రైతులను బయటే ఉంచి, కేవలం కాంగ్రెస్ కార్యకర్తలను మాత్రమే లోపలికి పిలిచి అభిప్రాయ సేకరణ జరుపుతున్నట్లు ప్రకటించడం గందరగోళానికి దారితీసింది.