byసూర్య | Fri, Jul 12, 2024, 04:10 PM
రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకంపై నియమించిన మంత్రి మండలి సబ్ కమిటీ సమావేశం శుక్రవారం డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి , నామా నాగేశ్వరావు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి, జిల్లా కలెక్టర్, రాష్ట్ర ఉన్నతాధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.