భువనగిరి 'స్వర్ణగిరి' ఆలయానికి వెళ్లాలనుకుంటున్నారా

byసూర్య | Wed, Jun 26, 2024, 08:34 PM

యాదాద్రి భువనగిరిలోని స్వర్ణగిరి ఆలయానికి భక్తులు పొటెత్తున్నారు. యాదాద్రికి వెళ్లే భక్తులు దాదాపుగా ఈ ఆలయాన్ని సందర్శిస్తున్నారు. పండగలు, వీకెండ్స్, హాలిడేస్ సమయాల్లో అయితే రద్దీ విపరీతంగా ఉంటుంది. హైదరాబాద్ నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో ఆలయాన్ని సందర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు గ్రేటర్హైదరాబాద్ ఆర్టీసీ అధికారులు గుడ్‌న్యూస్ చెప్పారు. నగరం నుంచి స్వర్ణగిరి ఆలయానికి స్పెషల్ బస్సులు నడపాలని నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచే ఈ స్పెషల్ సర్వీసు బస్సులను అందుబాటులోకి తెస్తున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ ఉన్నతాధికారులు వెల్లడించారు.


జేబీఎస్ బస్ స్టేషన్ నుంచి రెండు ఈ-మెట్రో ఎక్స్‌ప్రెస్ నాన్ ఏసీ బస్సులను స్వర్ణగిరి ఆలయానికి నడపనున్నట్లు తెలిపారు. ఈ బస్సులు ప్రతిరోజూ ఉదయం 7, 8 గంటలకు జేబీఎస్ బస్ స్టేషన్ నుంచి బయలుదేరి స్వర్ణగిరి ఆలయానికి చేరుకుంటాయి. మధ్యాహ్నం 2.50, 3.50 గంటలకు తిరిగి స్వర్ణగిరి ఆలయం నుంచి బయలుదేరుతాయి. ఇక ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి స్వర్ణగిరి ఆలయానికి ప్రతి రోజూ ఉదయం 7.30, 8.30, 10.35, 11.35 గంటలకు, మధ్యాహ్నం 3.20, 4.20 గంటలకు, సాయంత్రం 6.25, 7.25 గంటలకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉండనున్నాయి.


స్వర్ణగిరి ఆలయం నుంచి జేబీఎస్ స్టేషన్‌కు మధ్యాహ్నం 12.10, 1.10 గంటలకు, రాత్రి 8, 9 గంటలకు బస్సులు అందుబాటులో ఉంటాయి. స్వర్ణగిరి నుంచి తిరిగి ఉప్పల్ ఎక్స్ రోడ్ వరకు ఉదయం 8.55, 9.55 గంటలకు, సాయంత్రం 4.45, 5.45 గంటలకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. జేబీఎస్ స్టేషన్ నుంచి వెళ్లే బస్సుల్లో ఒక్కొక్కరికి టికెట్ధరను రూ.100గా, ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి వెళ్లే ప్రయాణికులకు రూ.80 ఛార్జీలుగా నిర్ణయించారు.


Latest News
 

తెలంగాణ బిజేపీ ఛీప్ గా ఆయన పేరు ఖరారు..? Thu, Oct 31, 2024, 04:53 PM
సైబరాబాద్ సీపీ అవినాష్ మోహంతి కీలక ప్రకటన Thu, Oct 31, 2024, 04:49 PM
స్టార్ క్యాంపెయినర్ గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క Thu, Oct 31, 2024, 04:45 PM
మధిర మండలంలో పర్యటించిన సీపీఎం పార్టీ రాష్ట్ర నాయకులు Thu, Oct 31, 2024, 04:44 PM
దేశానికి ఇందిరాగాంధీ సేవలు మరువలేనివి: కాంగ్రెస్ Thu, Oct 31, 2024, 04:43 PM