హైదరాబాద్‌లో దారుణం.. మరదలిని ప్రేమిస్తున్నాడని యువకుడిని చంపిన బావ

byసూర్య | Wed, Jun 26, 2024, 08:26 PM

హైదరాబాద్ బేగంపేటలో దారుణం చోటు చేసుకుంది. తన మరదలిని ప్రేమిస్తున్నాడని ఓ యువకుడిని బావ కిరాతకంగా హత్య చేశాడు. స్నేహితులతో కలిసి విచక్షణారహితంగా పొడిచి హతమార్చాడు. బేగంపేట పాటిగడ్డకు చెందిన ఉస్మాన్ అనే యువకుడు స్థానికంగా ఉన్న ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి బావ అజాజ్.. తన మరో ముగ్గురు మిత్రులతో కలిసి ఉస్మాన్‌ మర్డర్‌కు స్కెచ్ వేశాడు.


పాటిగడ్డలో రాత్రి సమయంలో ఇంటికి వెళ్తున్న ఉస్మాన్‌ను అడ్డగించారు. అజాజ్‌తో పాటు ముగ్గురు స్నేహితులు అతనిపై కత్తులతో దాడి చేసి చంపేశారు. అతని ప్రాణం పోయిన తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. హత్య జరిగిన ప్రాంతాన్ని నార్త్ జోన్ డీసీపీ రష్మీ పరిశీలించారు. క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసుకున్న బేగంపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు పాల్పడిన అజాజ్‌తో పాటు ఫిరోజ్, సాహిల్, రెహన్‌ను విచరిస్తున్నారు.


Latest News
 

ఫుడ్ డెలివరీ బాయ్స్‌గా ఇంజినీరింగ్ ప్రొఫెసర్లు.. నాలుగేళ్లలో సీన్ రివర్స్, ఎంత కష్టమెుచ్చింది Wed, Oct 30, 2024, 11:01 PM
తెలంగాణలో నేటి వాతావరణం.. ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్, పెరుగుతున్న చలి తీవ్రత Wed, Oct 30, 2024, 10:55 PM
తెలంగాణలో మయోనైజ్‌ నిషేధం.. రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం Wed, Oct 30, 2024, 10:50 PM
మయోనైజ్ ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలపై నిషేధం విధించిన ప్రభుత్వం Wed, Oct 30, 2024, 10:49 PM
తెలంగాణలో వాళ్లందరికీ రేవంత్ సర్కార్ దీపావళి కానుక.. రేపే అకౌంట్లలోకి డబ్బులు Wed, Oct 30, 2024, 10:45 PM