ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్.. ఇక క్యూలైన్లలో గంటలకొద్దీ నిల్చోవాల్సిన పనిలేదు

byసూర్య | Wed, Jun 26, 2024, 07:59 PM

బస్సు ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ అధికారులు గుడ్‌న్యూస్ చెప్పారు. హైదరాబాద్ నగరంలో కొత్తగా బస్సు పాస్ కౌంటర్లు పెట్టినట్లు గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ జోన్ అధికారులు వెల్లడించారు. ప్రయాణికుల సౌకర్యార్థం పాత కౌంటర్లకు అదనంగా మరికొన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు, ఉద్యోగులకు ఉపయోగ పడే విధంగా ఐటీ కారిడార్‌కు సమీపంలో జేఎన్టీయూ బస్టాప్, లక్డీకపూల్ బస్టాపుల్లో ఈ కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఈ కౌంటర్లు పని చేస్తాయన్నారు. ఉదయం 6.30 నుంచి రాత్రి 8.15 గంటల వరకు బస్ పాస్ కౌంటర్లు పని చేస్తాయని చెప్పారు. విద్యార్థులు, ఉద్యోగులు గంటలకొద్దీ క్యూలైన్లలో నిల్చోవాల్సిన పని లేకుండా ఈ కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.


  ఇక గ్రేటర్‌ హైదరాబాద్‌లో ప్రయాణికుల కోసం కొత్తగా గ్రీన్‌ మెట్రో లగ్జరీ నెలవారీ బస్సు పాస్‌లను ప్రవేశపెట్టారు. ఈ బస్సు పాస్ ధరను రూ.1900లుగా ధర నిర్ణయించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో 219 రూట్ నెంబరుతో సికింద్రాబాద్‌ - పటాన్‌చెరు మధ్య, 195 రూటు నెంబరుతో బాచుపల్లి - వేవ్‌రాక్‌ పార్కు మధ్య, 127కె నెంబరుతో కొండాపూర్‌ - కోఠి మధ్య ఏసీ బస్సులు నడుస్తున్నాయి. ఈ రూట్లలో ప్రయాణాలు సాగించేవారు గ్రీన్ మెట్రో లగ్జరీ నెలవారీ బస్సు పాసులను తీసుకోవానలి ఆర్టీసీ అధికారులు సూచించారు.


Latest News
 

ఫుడ్ డెలివరీ బాయ్స్‌గా ఇంజినీరింగ్ ప్రొఫెసర్లు.. నాలుగేళ్లలో సీన్ రివర్స్, ఎంత కష్టమెుచ్చింది Wed, Oct 30, 2024, 11:01 PM
తెలంగాణలో నేటి వాతావరణం.. ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్, పెరుగుతున్న చలి తీవ్రత Wed, Oct 30, 2024, 10:55 PM
తెలంగాణలో మయోనైజ్‌ నిషేధం.. రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం Wed, Oct 30, 2024, 10:50 PM
మయోనైజ్ ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలపై నిషేధం విధించిన ప్రభుత్వం Wed, Oct 30, 2024, 10:49 PM
తెలంగాణలో వాళ్లందరికీ రేవంత్ సర్కార్ దీపావళి కానుక.. రేపే అకౌంట్లలోకి డబ్బులు Wed, Oct 30, 2024, 10:45 PM