బ్లాక్ బుక్ ఓపెన్ చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే.. కేసీఆర్ సీఎం అయ్యాక ఫస్ట్ యాక్షన్ ఆయనపైనేనట

byసూర్య | Wed, Jun 26, 2024, 07:51 PM

కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ.. ఇప్పుడు కొత్తగా మరో అస్త్రాన్ని ప్రయోగించింది. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.. కొత్తగా బ్లాక్ బుక్ అందుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు చేసే అవినీతి చిట్టాను మొత్తం తాను ఆ బ్లూ బుక్‌లో పొందుపరుస్తానని చెప్పారు. అంతేకాకుండా 5 ఏళ్ల తర్వాత మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అప్పుడు.. వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


ఈ క్రమంలోనే తాజాగా ఆ బ్లాక్ బుక్‌లో మొదటగా మంత్రి పొన్నం ప్రభాకర్ పేరు చేర్చారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో ఉన్న వేంకటేశ్వర దేవాలయం సాక్షిగా.. పాడి కౌశిక్ రెడ్డి బ్లాక్ బుక్ ఓపెన్ చేశారు. ఈ సందర్భంగా ఎవరినీ వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తనకు లీగల్ నోటీసులు పంపించారని పేర్కొన్న కౌశిక్ రెడ్డి.. వేంకటేశ్వరస్వామి గుడికి వచ్చి ఆయన ప్రమాణం చేయాలని తాను సవాల్ చేసినట్లు తెలిపారు. ఫ్లై యాష్ వ్యవహారంలో జూబ్లీహిల్స్ వేంకటేశ్వరస్వామి గుడిలో ప్రమాణం చేద్దామని మంత్రి ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్‌కు కౌశిక్‌రెడ్డి సవాల్ విసిరారు


మంగళవారం తన స్వగ్రామంలో హనుమాన్ విగ్రహం సాక్షిగా ఫ్లై యాష్ వ్యవహారంలో ప్రమాణం చేశానని.. దానికి పొన్నం ప్రభాకర్ రాలేదంటే అవినీతి చేసినట్టు అర్థమవుతోందని చెప్పారు. నిన్న పొన్నం ప్రభాకర్ రాకపోవడంతో ఇవాళ హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడ సవాల్ చేసినట్లు తెలిపారు. బ్లాక్ బుక్‌లో మొదటి పేరు మంత్రి పొన్నం ప్రభాకర్‌దేనని రాశానని.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ ఘన విజయం సాధించి మరోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తారని కౌశిక్ రెడ్డి తెలిపారు. ఆ తర్వాత అధికారంలోకి రాగానే మొట్టమొదటగా పొన్నం ప్రభాకర్‌పై చర్యలు తీసుకుంటామని.. ఆయన చేసిన వంద కోట్ల అవినీతి బయటపెడతామని తీవ్ర హెచ్చరికలు చేశారు.


ఇక ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి.. ఆరు స్కాములు చేసిందని.. తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కానీ ఆరు గ్యారెంటీలు మాత్రం అమలు కావడం లేదని మండిపడ్డారు. అవినీతికి పాల్పడుతున్న అధికారులు, మంత్రులకు మళ్లీ బ్లాక్ డేస్ రాక తప్పదని ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి హెచ్చరించారు.


Latest News
 

ఫుడ్ డెలివరీ బాయ్స్‌గా ఇంజినీరింగ్ ప్రొఫెసర్లు.. నాలుగేళ్లలో సీన్ రివర్స్, ఎంత కష్టమెుచ్చింది Wed, Oct 30, 2024, 11:01 PM
తెలంగాణలో నేటి వాతావరణం.. ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్, పెరుగుతున్న చలి తీవ్రత Wed, Oct 30, 2024, 10:55 PM
తెలంగాణలో మయోనైజ్‌ నిషేధం.. రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం Wed, Oct 30, 2024, 10:50 PM
మయోనైజ్ ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలపై నిషేధం విధించిన ప్రభుత్వం Wed, Oct 30, 2024, 10:49 PM
తెలంగాణలో వాళ్లందరికీ రేవంత్ సర్కార్ దీపావళి కానుక.. రేపే అకౌంట్లలోకి డబ్బులు Wed, Oct 30, 2024, 10:45 PM