byసూర్య | Sat, Jun 22, 2024, 03:43 PM
బాన్సువాడ MLA పోచారం శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆ పార్టీ బలం పెరగనుంది. జిల్లాలోని 9 మంది MLAల్లో నలుగురు కాంగ్రెస్ పార్టీకి చెందినవారు ఉన్నారు. తాజాగా పోచారం చేరికతో ఆ సంఖ్య ఐదుగురికి చేరింది. ఆయన చేరిక రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపించేందుకు అవకాశం ఉంది. దీంతో పాటు జిల్లాలోని పలువురు నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.