byసూర్య | Thu, Jun 20, 2024, 02:39 PM
కోటగిరి మండలంలోని ఎక్లాస్పూర్ గ్రామం వద్ద ద్విచక్ర వాహనం పై నుండి పడి భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. బుధవారం సాయంత్రం కోటగిరి నుండి స్వగ్రామమైన కొత్తపల్లికి సాయిబాబా, పోషవ్వ ద్విచక్ర వాహనంపై అదుపుతప్పి కింద పడడంతో భార్యాభర్తలు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కోటగిరి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.