byసూర్య | Thu, Jun 20, 2024, 02:37 PM
బంజార ఆడపిల్లలు బంజారా సంస్కృతిలో జరుపుకునే "బతోకోళ్ల"అనే పండుగను గాంధారి మండలం నేరల్ తండాలో బుధ, గురువారాల్లో ఘనంగా జరుపుకున్నారు. పంటలు ఎండిపోతున్నాయిని వారు ప్రతి ఇంటికీ వెళ్లి బియ్యం దానంగా అడిగి అందరూ కలసి వంటలు చేసి ఆ వంటను వనదేవుళ్ళను నైవేద్యంగా పెట్టారు. పశుసంపద పెరిగి, సిరిసంపదలతో అందరూ బాగుండి, వానాకాలం సమృద్ధిగా వర్షాలు కురువాలని వారుణున్ని మొక్కుకున్నారు.