byసూర్య | Thu, Jun 20, 2024, 02:34 PM
కూలి డబ్బుల కోసం భర్తతో గొడవపడి మహిళ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సదాశివనగర్ లో చోటుచేసుకుంది. మండలానికి చెందిన చెందిన లక్ష్మీ(28), ఆమె భర్త హరీశ్ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. బుధవారం కూలి డబ్బుల విషయంలో భార్యాభర్తలు గొడవపడడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.