బావమరది కోసం బావ మోకాళ్ల యాత్ర,,,70 కి.మీ నడిచిన బావ

byసూర్య | Tue, May 28, 2024, 08:23 PM

బావ బాగు కోరేవాడే బావమరది అని పెద్దలు అంటూ ఉంటారు. బావమరది ప్రతిక్షణం బావ క్షేమాన్ని కోరుకుంటాని చెబుతుంటారు. కానీ ఇక్కడ సీన్ మాత్రం రివర్స్. ఓ బావ తన బావమరిది బాగు కోసం ఆలోచించాడు. అతడి కోసం ఏకంగా 70 కి.మీ మోకాళ్లపై నడిచి దేవుడి మెుక్కులు తీర్చుకున్నాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన బావమరిది త్వరగా కోలుకోవాలని కోరుకొని.. ఐనవోలు మల్లన్న ఆలయానికి మెకాళ్లపై నడుచుకుంటూ వెళ్లి మెుక్కు తీర్చున్నాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లాలో చోటు చేసుకుంది.


వివరాల్లోకి వెళితే.. హనుమకొండ జిల్లా కమలాపురం మండలం అంబాల గ్రామానికి చెందిన రజినీకాంత్ అనే యువకుడు ఈనెల 17న రోడ్డు ప్రమాదనికి గురయ్యాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా.. ఆసుపత్రిలో జాయిన్ చేశారు. పరీక్షించిన డాక్టర్లు పరిస్థితి విషమని.. ఆ దేవుడిదే భారమంటూ చేతులెత్తేశారు. రజినీకాంత్ బావ నాగరాజు తన బావమరిది కోలుకుంటే మోకాళ్లపై వచ్చి మొక్కలు సమర్పించుకుంటానని ఐనవోలు మల్లికార్జున స్వామి వారికి మెుక్కుకున్నారు. డాక్టర్ల కృషి ఫలించటంతో రజినీకాంత్ ఆరోగ్య పరిస్థితి మెరుగైంది.


రజినీకాంత్ ప్రమాదం నుంచి కోలుకోవడంతో తాను మెుక్కిన మెుక్కు తీర్చుకోవాలని నాగరాజు భావించాడు. ఐనవోలు మల్లన్న స్వామి చల్లని చూపుతోనే తన బావమరిది ప్రాణాలతో బయటపడ్డాడని మోకాళ్లపై నడుచుకుంటూ స్వామిని దర్శించుకున్నాడు. తన ఇంటి నుంచి సుమారు 70 కి.మీ మెకాళ్లపై నడుచుకుంటూ వెళ్లి ఐనవోలు మల్లన్నకు మెుక్కులు చెల్లించుకున్నాడు. నాగరాజు సంకల్పం గురించి తెలుసుకున్న ఆలయ కార్య నిర్వహణ అధికారి, అర్చకులు ఘనంగా సన్మానించి ఆశీర్వచనాలు అందజేశారు.


నాగరాజు చేసిన పనికి నెటిజన్లు హ్యాట్సాప్ చెబుతున్నారు. నిజమైన ప్రేమ ఆప్యాయతలు అంటే ఇవే అని కామెంట్లు పెడుతున్నారు. సొంత తల్లితండ్రుల గురించి పట్టించుకోని ఈ రోజుల్లో బావమరిది కోసం ఈ పని చేసినవంటే నీకు సెల్యూట్ చేయాల్సిందేనని అంటున్నారు. బావమరది బావ బాగు కోరుతాడనే పదానికి కొత్త అర్థం చెబుతూ.. బావ కూడా బావమరిది బాగు కోరుతాడని నిరూపించాడని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.


Latest News
 

ఆలయాలపై దాడులు చేసిన వారిని శిక్షించాలి Fri, Oct 18, 2024, 01:48 PM
జూరాలకు పెరిగిన ఇన్ ఫ్లో Fri, Oct 18, 2024, 01:48 PM
సమయానికి బస్సులు నడపాలని వినతి Fri, Oct 18, 2024, 01:47 PM
పేద‌ల ఇండ్లు కూల్చ‌కుండా సుంద‌రీక‌ర‌ణ ప‌నులు చేయాలి : కిషన్ రెడ్డి Fri, Oct 18, 2024, 12:51 PM
గ్యాస్ సిలిండర్ ప్రొసీడింగ్ పత్రాలు పంపిణీ Fri, Oct 18, 2024, 12:19 PM