ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్

byసూర్య | Mon, May 27, 2024, 11:25 AM

వరంగల్‌ - ఖమ్మం -నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది.మొత్తం 12 జిల్లాల పరిధిలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నిక జరుగుతోంది. 52 మంది అభ్యర్థులు ఈ ఉపఎన్నిక బరిలో నిలిచారు. జూన్‌ 5న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పలువురు రాజకీయ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సూర్యాపేటలోని జూనియర్‌ కళాశాలలో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఓటు వేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న , ఆయన సతీమణి మమత ఓటు హక్కును వినియోగించుకున్నారు. హనుమకొండ జిల్లా కేంద్రంలోని పింగళి ప్రభుత్వ మహిళా కళాశాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ఓటేశారు. నల్గొండ డైట్ స్కూల్లో హరిచందన ఓటేశారు.


 


Latest News
 

బార్ అండ్ పబ్బులలో పోలీసులు అకస్మిక తనిఖీలు Wed, Oct 23, 2024, 12:49 PM
మంత్రి పుట్టినరోజు సందర్భంగా కబడ్డీ పోటీలు Wed, Oct 23, 2024, 12:45 PM
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే Wed, Oct 23, 2024, 12:44 PM
రక్తదానం చేసిన యువకులకు సర్టిఫికెట్స్ అందజేసిన నాచారం సిఐ Wed, Oct 23, 2024, 12:19 PM
సూర్యలంక పర్యాటక కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే వేగేశన Wed, Oct 23, 2024, 11:51 AM