ప్రయాణికులకు ముఖ్య గమనిక.. టీఎస్ఆర్టీసీ పేరు మారింది.. కొత్త పేరు ఇదే

byసూర్య | Wed, May 22, 2024, 07:17 PM

తెలంగాణ ప్రయాణికులకు ముఖ్య గమనిక.. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పేరు అధికారికంగా మారింది. తెలంగాణ సంక్షిప్త పదం టీఎస్‌ నుంచి టీజీగా మార్చాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ఇటీవల అధికార ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. మొన్నటివరకు కేవలం వాహనాల నెంబర్ ప్లేట్ల మీదే టీజీగా మారిన తెలంగాణ షార్ట్ ఫాం.. అన్ని ప్రభుత్వ సంస్థల పేర్లలో.. ఆయా శాఖలు జారీ చేసే ఉత్తర్వుల్లో మార్చాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో.. ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు.. ఇప్పటికే పలు శాఖలు పేరు మార్పు చేపట్టగా.. తాజాగా టీఎస్ఆర్టీసీ పేరును టీజీఎస్ ఆర్టీసీగా మార్చుతూ సంస్థ అధికారికంగా ప్రకటించింది.


దీంతో.. ఇక నుంచి ఆర్టీసీ బస్సులపై టీఎస్ఆర్టీసీ స్థానంలో టీజీఎస్ఆర్టీసీ అని మార్చనున్నారు. ఈమేరకు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు టీఎస్‌ఆర్టీసీ పేరును టీజీఎస్‌ఆర్టీసీగా మార్చడం జరిగింది. ఆ మేరకు అధికారిక ట్విట్టర్, ఫేస్‌బుక్ ఖాతాల పేర్లు కూడా మార్చినట్టు సజ్జనార్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రయాణికులు, నెటిజన్లు గమనించి.. విలువైన సలహాలు, సూచనలతో పాటు ఫిర్యాదులను మార్చిన ఈ ఖాతాల ద్వారా తమ దృష్టికి తీసుకురావాలని సజ్జనార్ కోరారు.


అయితే.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన తర్వాత అప్పటి బీఆర్ఎస్ సర్కార్.. తెలంగాణ షార్ట్ ఫామ్‌ను టీఎస్‌గా మార్చగా.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగా దాన్ని టీజీగా మార్చుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ వాహనాల రిజిస్ట్రేషన్‌కు మాత్రమే పరిమితమైన టీజీ నిబంధన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని అధికారిక వ్యవహారాలకూ వర్తింపజేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో.. ఇప్పటికే టీఎస్ఎస్పీడీసీఎల్‌ను టీడీఎస్పీడీసీఎల్‌గా మార్చగా.. ఇదే క్రమంలో ఆయా సంస్థలన్ని అధికారికంగా పేర్లు మార్చుతున్నాయి.



Latest News
 

లబ్ధిదారులకు రూ.500 సబ్సీడీ గ్యాస్ ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ Fri, Sep 20, 2024, 03:29 PM
విగ్నేశ్వరుని దర్శించుకున్న ఎమెల్సీ శంభీపూర్ రాజు Fri, Sep 20, 2024, 03:26 PM
స్వచ్ఛత హి సేవ - 2024 అవగాహన కార్యక్రమం Fri, Sep 20, 2024, 03:23 PM
తెలంగాణ ఆర్‌టీసీ బ‌స్సుల్లో క్యూఆర్ కోడ్ చెల్లింపులు Fri, Sep 20, 2024, 03:20 PM
సీఎంఆర్ గడువులోగా ఇవ్వాలి Fri, Sep 20, 2024, 03:20 PM