ప్రభుత్వ అధికారి లంచం డిమాండ్ చేస్తే.. ఈ నెంబర్‌కు కాల్ చేయండి

byసూర్య | Sat, Apr 27, 2024, 08:51 PM

కొన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో ఏ చిన్న పని కావాలాన్న లంచం ఇవ్వాల్సిందే. టేబుల్ కింద చేయి పెట్టనిదే చాలా మంది అధికారులు ఫైల్ కదలనివ్వరు. ఇది జగమెరిగిన సత్యం. అందరు లంచం డిమాండ్ చేయకోవచ్చు. కానీ కొందరు అవినీతి తిమింగళాలు మాత్రం లంచం తీసుకోకుండా ఏ చిన్న పనిని పూర్తిచేయరు. ఇటీవల కాలంలో లంచం తీసుకుంటూ చాలా మంది ప్రభుత్వ అధికారులు పట్టుబడ్డారు.


 తాజాగా.. హైదరాబాద్‌లో మరో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కాడు. వాణిజ్య భవనానికి నిరభ్యంతర పత్రం ఇచ్చేందుకు రూ.5 లక్షల లంచం డిమాండ్‌ చేసిన నీటిపారుదల శాఖ డిప్యూటీ కార్యనిర్వాహక ఇంజినీరు యాత పవన్‌కుమార్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తన కార్యాలయంలోనే లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని రిమాండుకు తరలించారు. రామంతాపూర్‌కు చెందిన బిల్డర్‌ గోపగాని రమణమూర్తి ఉప్పల్‌ భగాయత్‌లోని శాంతినగర్‌లో వాణిజ్య భవనం నిర్మిస్తున్నారు. ఆ భవనానికి ఎన్వోసీ కోసం దరఖాస్తు చేసుకోగా.. పవన్‌కుమార్‌ రూ.5 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.


దీంతో బాధితుడు రమణమూర్తి ఏసీబీకి సమాచారం ఇచ్చాడు. రమణమూర్తి శుక్రవారం బుద్ధభవన్‌లోని కార్యాలయంలో పవన్‌కు రూ.4 లక్షలు ఇస్తుండగా అధికారులు పట్టుకున్నారు. నగదు స్వాధీనం చేసుకొని.. నాంపల్లిలోని ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయస్థానం లంచగొండి అధికారికి రిమాండ్ విధించింది. ఏ ప్రభుత్వోద్యోగి అయినా లంచం అడిగితే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1064 కాల్ చేయాలని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు.


Latest News
 

కాంగ్రెస్ పార్టీకి ఓటుతో తగిన బుద్ధి చెప్పాలి Fri, May 10, 2024, 01:36 PM
తండాలను గ్రామపంచాయతీలుగా చేసిన ఘనత కేసీఆర్ దే Fri, May 10, 2024, 11:50 AM
ఇంటింటా ప్రచారం బిజెపి ఓబీసీ అధ్యక్షుడు Fri, May 10, 2024, 11:33 AM
ఉపాధి హామీ పథకాన్ని తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం Fri, May 10, 2024, 11:33 AM
అధికారికంగా బసవ జయంతి వేడుకలు Fri, May 10, 2024, 11:24 AM