ఉద్యోగులందరికీ గుడ్ న్యూస్.. ఆరోజున జీతంతో కూడిన సెలవు

byసూర్య | Thu, Apr 25, 2024, 07:09 PM

 తెలంగాణలో ఉన్న ఉద్యోగులందరికీ గుడ్ న్యూస్.. మే 13న జీతంతో కూడిన సెలవు దినంగా ప్రకటిస్తూ.. ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే.. తెలంగాణ వ్యాప్తంగా... మే 13న లోక్ సభ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే స్థానానికి ఉపఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. కాగా.. ఆరోజున అందరూ పోలింగ్ ప్రక్రియలో పాల్గొని.. ఓటింగ్ హక్కును వినియోగించుకోవాలన్న ఉద్ధేశంతో వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటించారు. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ చేశారు.


అయితే.. తెలంగాణలో ఎవరైనా ఇతర రాష్ట్రాలకు చెందిన (మహారాష్ట్ర, కర్ణాటక, ఛతీస్ ఘడ్) కు చెందిన ఉద్యోగులు తమతమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సెలవుపై వాళ్లు తమ రాష్ట్రాలకు వెళ్లినా కూడా.. వారికి ఆ రోజు వేతనం ఇవ్వాల్సిందిగా ఉత్తర్వుల్లో వికాస్ రాజ్ పేర్కొన్నారు. దీని వల్ల.. ఉద్యోగులంతా పోలింగ్ ప్రక్రియలో పాల్గొని ఓటును హక్కును వినియోగించుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.


మరోవైపు.. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేటు ఉద్యోగులకు కూడా ఆరోజును పెయిడ్ హాలిడేగా ప్రకటించాలని ప్రభుత్వం సూచించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ.. ఇదే విధంగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. పక్కరాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోనూ మే 13 వ తేదీనే లోక్ సభ, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో.. ఏపీలో కూడా మే 13వ తేదీని వేతనంతో కూడిన సెలవు దినంగా అక్కడి ఎన్నికల అధికారులు ఇప్పటికే ప్రకటించారు.


Latest News
 

దేవుళ్ల మీద ఒట్లు వేస్తూ రోజుకో తేదీ అంటున్నారు : కేటీఆర్ Sat, May 04, 2024, 09:48 PM
శ్రీరామనవమి వేడుకలు.. భద్రాద్రి రామయ్య హుండీ ఆదాయం ఎన్ని కోట్లో తెలుసా Sat, May 04, 2024, 08:55 PM
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ ఛార్జీలు మినహాయింపు Sat, May 04, 2024, 08:50 PM
కాంగ్రెస్‌కు ఓటేస్తే నన్ను చంపినట్టే.. మోత్కుపల్లి భావోద్వేగం, అందరిముందే కన్నీళ్లు Sat, May 04, 2024, 08:43 PM
భగ్గుమంటున్న భానుడు.. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, వడదెబ్బతో ఆరుగురు మృతి Sat, May 04, 2024, 08:38 PM