శ్రీరామనవమి వేడుకలు.. భద్రాద్రి రామయ్య హుండీ ఆదాయం ఎన్ని కోట్లో తెలుసా

byసూర్య | Sat, May 04, 2024, 08:55 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం దేశంలో దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రంలో కొలువైన శ్రీ సీతా సమేత శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకునేందుకు దేశ నలుమూలాల నుంచి రామభక్తులు నిత్యం భద్రాద్రి క్షేత్రానికి వస్తుంటారు. గత నెల 16న ఇక్కడ శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భద్రాద్రి రామయ్య కల్యాణోత్సవంలో పాల్గొన్నారు.


కాగా.. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి 35 రోజులుగా భక్తులు సమర్పించిన కానుకలను, హుండీ ఆదాయాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి రమాదేవి అధ్వర్యంలో ఆలయ అధికారులు, సిబ్బంది లెక్కించారు. ఈ లెక్కింపు అనంతరం భక్తుల కానుకల ద్వారా వచ్చిన హుండీల ఆదాయాన్ని అధికారులు ప్రకటించారు. 35 రోజులకు రూ.1,31,84,181 నగదు రూపంలో సమకూరిందని అధికారులు తెలిపారు. యూఎస్‌ డాలర్లు 25, యూఏఈ దిర్హమ్స్‌ 55, సింగపూర్‌ డాలర్లు 2, ఇంగ్లండ్‌ పౌండ్లు 10, థాయ్‌ల్యాండ్‌ బాట్స్‌ 20, సౌదీ రియాల్స్‌ 17, వెండి 1.45 కిలోలు, బంగారం 230 గ్రాములు కానుకల రూపంలో ఆలయానికి వచ్చినట్లు ఈవో రమాదేవి చెప్పారు. భక్తులు సమర్పించిన కానుకల మొత్తాన్ని బ్యాంకులో స్వామివారి పేరిట జమ చేశారు. శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఈ ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.


Latest News
 

జ్యోతి యాత్రలో పాల్గొన్న కొత్తకోట కాంగ్రెస్ నాయకులు Sat, May 18, 2024, 04:14 PM
ఉరేసుకుని ఆటో డ్రైవర్ మృతి Sat, May 18, 2024, 04:12 PM
స్థానిక సంస్థల రిజర్వేషన్లు పెంచాలని వినతి Sat, May 18, 2024, 04:11 PM
జూరాలకు చేరిన కర్ణాటక నీళ్ళు Sat, May 18, 2024, 04:10 PM
బీఆర్ఎస్ పార్టీ బీమా చెక్ అందజేత..! Sat, May 18, 2024, 04:08 PM