బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు.. ఈసారి పోలీసులే

byసూర్య | Fri, Apr 19, 2024, 07:32 PM

తరచూ.. ఏదో ఒక వివాదాస్పదన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్‌లో భారీ ర్యాలీ తీసి.. తన పాటలతో రామ భక్తులను ఉత్సాహపరిచారు. అయితే.. ఇంతవరకు భాగానే ఉన్నా దీనిపై పోలీసులు ఇప్పుడు రాజాసింగ్ మీద కేసు నమోదు చేశారు. నగరంలో అనుమతి లేకుండా భారీ ర్యాలీ తీయటాన్ని సుమోటోగా తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆఫ్జల్‌గంజ్ పోలీసులు రాజాసింగ్‌ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. శోభాయాత్రలో భాగంగా.. గౌలిగూడ వద్ద ర్యాలీ ఆపేసి.. రోడ్డు మీదే బాణాసంచా కాల్చడంతో పాటు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించినట్లు ఫిర్యాదులో పోలీసులు పేర్కొన్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌తో పాటు జోగేందర్ సింగ్, బిట్టులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.


ఏప్రిల్ 17వ తేదీ బుధవారం రోజున.. శ్రీరామనవమి సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ ర్యాలీ తీసిన విషయం తెలిసిందే. ఈ ర్యాలీకి పెద్ద ఎత్తున రామ భక్తులు, బీజేపీ కార్యకర్తలు, రాజాసింగ్ అభిమానులు హాజరయ్యారు. అయితే.. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా.. శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు ముందుగానే రాజాసింగ్ శోభాయాత్రకు పర్మిషన్ ఇవ్వలేదు. అనుమతి నిరాకరించినప్పటికీ.. రాజాసింగ్ మాత్రం ర్యాలీ తీశారు. దీంతో.. ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు.. సుమోటోగా రాజాసింగ్‌ మీద కేసు నమోదు చేశారు.


Latest News
 

ఢిల్లీ సుల్తానులు భయపెట్టాలని చూస్తున్నారు.. మోదీ, అమిత్ షాలపై సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ Thu, May 02, 2024, 08:37 PM
వారెవ్వా.. పెట్రోల్ బంక్ యజమాని ఐడియా అదుర్స్.. క్యూ కడుతున్న కస్టమర్స్ Thu, May 02, 2024, 08:32 PM
భానుడి ఉగ్రరూపం.. సాధారణం కన్నా 2.1 డిగ్రీలు అధికం, జాగ్రత్తలు తీసుకోండి Thu, May 02, 2024, 08:20 PM
ఛత్తీస్‌గఢ్‌‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు తెలంగాణ మావోయిస్టులు మృతి, వీరిపై లక్షల్లో రివార్డు Thu, May 02, 2024, 08:14 PM
ఎన్నికపై వివాదం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డికి హైకోర్టు నోటీసులు Thu, May 02, 2024, 08:11 PM