తెలంగాణలో ఎంపీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ఆ అవకాశం కూడా కల్పించిన ఈసీ

byసూర్య | Fri, Apr 19, 2024, 07:37 PM

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పర్వం మొదలైంది. నోటిఫికేషన్ విడుదల కావటంతో.. నేటి నుంచే నామినేషన్లు కూడా ప్రారంభమయ్యాయి. తొలిరోజే.. పలువురు అభ్యర్థులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. అయితే.. ఇప్పటికే ప్రచారంలో భాగంగా తమ సెగ్మెంట్లలో బిజీ బిజీగా తిరుగుతున్న అభ్యర్థులు.. నామినేషన్ కోసం మళ్లీ రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి రావాల్సి ఉంటుంది. అయితే.. కేవలం నామినేషన్ కోసమే ఆర్వో కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండా.. అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఆన్లైన్లో కూడా అందించొచ్చని సీఈసీ వికాస్ రాజ్ వెల్లడించారు.


అయితే.. నామినేషన్ పత్రాల్లో తప్పనిసరిగా లెటెస్ట్ ఫోటోలు పెట్టాలని వికాస్ రాజ్ తెలిపారు. లేదంటే నామినేషన్ పత్రాలను రిజెక్ట్ చేస్తామని వికాస్ రాజ్ సూచించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వికాస్ రాజ్ కీలక సూచనలు చేశారు. నామినేషన్ ఫామ్.. అఫిడవిట్‌లు జాగ్రత్తగా నింపాలని తెలిపారు. ఫాం-ఏ, ఫాం-బీపై ఒరిజినల్ సంతకాలు ఉండాలని వికాస్ రాజ్ తెలిపారు.


 ఇదిలా ఉంటే.. నామినేషన్ పేపర్లు దాఖలు చేసే సమయంలో ఒకసారి ఆర్వో కార్యాలయంలోకి ప్రవేశిస్తే.. బయటకు వెళ్లేందుకు వీలు లేదని వికాస్ రాజ్ తెలిపారు. నామినేషన్ పత్రాల దాఖలు కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయమని ఆర్వోలను ఆదేశించినట్టు చెప్పుకొచ్చారు. అభ్యర్థి కచ్చితంగా క్రిమినల్ హిస్టరీ పబ్లిష్ చెయ్యాల్సి ఉంటుందని తెలిపారు. నామినేషన్ వేసే ప్రతి అభ్యర్థి ముందు రోజు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఎన్నికల ఖర్చు అకౌంట్‌లో చూపించాలని.. గతంసారి ఓపెన్ చేసిన బ్యాంక్ అకౌంట్ ఈసారి మళ్లీ ఉపయోగించవద్దని వికాస్ రాజ్ వివరించారు.


నామినేషన్ల దాఖలుకు ఏప్రిల్ 25 చివరి తేదీ కాగా.. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన, 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు ఛాన్స్ ఇచ్చింది ఎన్నికల సంఘం. అయితే.. మే 13న ఎన్నికలు జరగనుండగా.. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఇదిలా ఉంటే.. 19, 23,24వ తేదీల్లో మంచి ముహూర్తం ఉన్నట్టు పండితులు చెప్తుండటంతో.. ఆ రోజుల్లోనే ఎక్కువ నామినేషన్లు దాఖలయ్యే అవకాశం కనిపిస్తోంది.


Latest News
 

ఢిల్లీ సుల్తానులు భయపెట్టాలని చూస్తున్నారు.. మోదీ, అమిత్ షాలపై సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ Thu, May 02, 2024, 08:37 PM
వారెవ్వా.. పెట్రోల్ బంక్ యజమాని ఐడియా అదుర్స్.. క్యూ కడుతున్న కస్టమర్స్ Thu, May 02, 2024, 08:32 PM
భానుడి ఉగ్రరూపం.. సాధారణం కన్నా 2.1 డిగ్రీలు అధికం, జాగ్రత్తలు తీసుకోండి Thu, May 02, 2024, 08:20 PM
ఛత్తీస్‌గఢ్‌‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు తెలంగాణ మావోయిస్టులు మృతి, వీరిపై లక్షల్లో రివార్డు Thu, May 02, 2024, 08:14 PM
ఎన్నికపై వివాదం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డికి హైకోర్టు నోటీసులు Thu, May 02, 2024, 08:11 PM