వారెవ్వా.. పెట్రోల్ బంక్ యజమాని ఐడియా అదుర్స్.. క్యూ కడుతున్న కస్టమర్స్

byసూర్య | Thu, May 02, 2024, 08:32 PM

భానుడు భగభగా మండిపోతూ.. నిప్పులు కురిపిస్తున్నాడు. రాష్ట్రమంతా అధిక ఉష్ణోగ్రతలతో నిప్పుల కొలిమిని తలపిస్తోంది. 10 గంటల నుంచే జనాల మాడులు పగిలిపోతున్నాయి. బయటికి రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు. ఇప్పటికే 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదువతుండటంతో.. వాతావరణ శాఖ కూడా ఆయా ప్రాంతాలకు ఎల్లో, రెడ్ అలర్టులు ప్రకటించింది. అత్యవరసరమైతేనే మధ్యాహ్నం సమయంలో బయటకు రావాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో.. మధ్యాహ్నం పూట ఎండలో బయటికి వస్తున్న జనాల కష్టాలను గమనించిన ఓ పెట్రోల్ బంగ్ యజమాని.. వినూత్నంగా ఆలోచించాడు. తన బంక్‌కు వచ్చే కస్టమర్లకు ఎండ వేడిమి నుంచి కాసేపు ఉపశమనం కలిగించేందుకు తనవంతు ప్రయత్నం చేస్తూ.. అందరి చేత "సూపర్ బ్రో.. నువ్వు చల్లగా ఉండాలి" అనిపించుకుంటున్నాడు.


కరీంనగర్‎లోని జ్యోతినగర్ మల్కాపూర్ రోడ్‎లో ఉన్న ఓ పెట్రోల్ బంక్ యజమాని కొత్తగా ఆలోచించాడు. తన బంకుకు వచ్చే వాహనదారులకు ఉపశమనం కల్పించేందుకు.. బంక్‎కు ప్రత్యేకంగా స్పింక్లర్లు ఏర్పాటు చేసి నీటి జల్లులను కురిపిస్తున్నాడు. రోజూ మధ్యాహ్నం వేళల్లో 4 నుంచి 5 గంటల వరకు బంక్ చుట్టూ ఏర్పాటు చేసిన ఈ స్పింక్లర్ల ద్వారా వాటర్ స్ప్రే చేస్తున్నారు. దీంతో.. ఎండ వేడి నుంచి కొంత వరకు ఉపశమనం కలుగుతోంది.


అప్పటివరకు కరీంనగర్‌లోని వివిధ ప్రాంతాల మీదుగా ట్రావెల్ చేసి బంకు వద్దకు చేరుకుంటున్న కస్టమర్స్ చల్లటి వాతవారణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఎండతో అల్లాడిపోతున్న వాహనదారులు ఆ బంకు వద్దకు చేరుకోగానే కొంత ఉపశమనం పొందుతున్నారు. పెట్రోల్ బంక్ యజమాని చేసిన ఈ ఆలోచనకు.. వాహనదారులంతా అభినందనలు తెలుపుతున్నారు. అయితే.. ఈ స్ప్రింకర్ల కోసం గంటకు ఒక ట్యాంకు చొప్పున నీరు వినియోగిస్తున్నారు.


అయితే.. ఈ స్ప్రింకర్ల ఆలోచన కేవలం వాహనదారుల కోసమే కాదండోయ్.. ఈ ఎండ వేడికి పెట్రోల్ బంక్‌లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకని సిబ్బంది చెప్తున్నారు. ఎండ తీవ్రతకు కొన్ని వాహనాల ఇంజన్లు వేడెక్కిపోయి ఒక్కసారిగా మంటలు చెలరేగుతుంటాయి. కొన్నిసార్లు పెట్రోల్ బంకుల్లోనూ అగ్నిప్రమాదాలు జరుగుతుంటాయి. అలాంటి.. ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు మధ్యాహ్నం నుంచి ఎండ తీవ్రత తగ్గేవరకు.. పెట్రోల్ బంక్‎లో వాటర్ స్ప్రే చేయిచటం మంచిదని భావిస్తున్నారు.


సాధారణంగా అయితే.. ఈ స్ప్రింకర్లను ఎండ తీవ్రత నుంచి కోళ్లను రక్షించేందుకు పౌల్ట్రీఫారంలలో వాడుతుంటారు. కాగా.. ఇదే ట్రిక్‎ను పెట్రోల్ బంకుల్లోనూ వాడుతూ.. వాహనదారులకు ఉపశమనం కలిగించటమే కాకుండా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా వాడటం అభినందనీయమని వాహనదారులు మెచ్చుకుంటున్నారు. ప్రమాదం జరిగాక బాధపడటం కంటే.. అసలు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు అదిరిపోయే ఐడియాను అమలు చేస్తూ పెట్రోల్ బంక్ యజమాని వారెవ్వా అనిపించుకుంటున్నాడు.


Latest News
 

రైతులు పండించే అన్ని వడ్లకి విధిగా బోనస్ చెల్లించాల్సిందే Fri, May 17, 2024, 02:08 PM
బిఆర్ఎస్ పై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు Fri, May 17, 2024, 02:05 PM
ఆగ్రామాన్ని సందర్శించిన ఎమ్మెల్యే శంకర్ Fri, May 17, 2024, 02:04 PM
మైనంపల్లి రోహిత్‌కు షాక్.. Fri, May 17, 2024, 12:45 PM
త్వరలో సీఎం రేవంత్ కేబినెట్ విస్తరణ Fri, May 17, 2024, 12:39 PM