ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్ నేత సిరిపెల్లి దంపతుల మృతి.. చిన్నతనంలోనే పీపుల్స్ వార్‌లోకి

byసూర్య | Fri, Apr 19, 2024, 07:29 PM

మంగళవారం ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో జరిగిన భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో 29 మంది మావోయిస్ట్‌లు మృతిచెందిన విషయం తెలిసిందే. మృతుల్లో తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్ట్ నేత సిరిపెల్లి శంకర్‌రావు అలియాస్‌ సుధాకర్‌ అలియాస్‌ మురళి, ఆయన భార్య దాశేశ్వర్‌ అలియాస్‌ సుమన అలియాస్‌ రంజితలు చనిపోయారు. చల్లగరిగెకు చెందిన శంకర్‌రావు ఉన్నట్లు వెల్లడి కావడంతో.. ఆయన తల్లి రాజపోచమ్మ, కుటుంబ సభ్యులు గురువారం ఉదయం కాంకేర్‌కు చేరుకుని, అక్కడ శంకర్‌రావు, రంజితల మృతదేహాలను గుర్తించారు.


తమ కుమారుడితో పాటు అదిలాబాద్‌ జిల్లా బజార్‌హత్నూర్‌కు చెందిన రంజిత మృతదేహాన్ని కూడా తీసుకెళ్తామని శంకర్‌రావు కుటుంబసభ్యులు కోరగా.. పోలీసులు అందుకు అంగీకరించారు. మృతదేహాలు చల్లగరిగె శుక్రవారం చేరుకున్నాయి. అనంతరం కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సుధాకర్ దంపతుల చివరిచూపు కోసం చుట్టు పక్కల గ్రామాల జనం తరలి వస్తున్నారు. చల్లగరిగెకు చెందిన రాజపోచమ్మ, ఓదేలు దంపతుల కుమారుడు సిరిపెల్లి సుధాకర్‌.. నాటి పీపుల్స్‌వార్‌ పార్టీ పట్ల ఆకర్షితుడై చిన్నతనంలోనే ఉద్యమంలో చేరాడు.


1998లో జైలుకు వెళ్లిన సుధాకర్.. విడుదలయ్యాక 2000 సంవత్సరంలో పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లారు. సుధాకర్ రెండు దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉన్నారు. ఉద్యమంలోనే రంజితను వివాహం చేసుకున్నారు. ఇక, చల్లగరిగే ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ స్వగ్రామం కావడం విశేషం. చంద్రబోస్, శంకరరావు ఇళ్లు ఒకే వీధిలో ఉన్నాయి.


Latest News
 

ఢిల్లీ సుల్తానులు భయపెట్టాలని చూస్తున్నారు.. మోదీ, అమిత్ షాలపై సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ Thu, May 02, 2024, 08:37 PM
వారెవ్వా.. పెట్రోల్ బంక్ యజమాని ఐడియా అదుర్స్.. క్యూ కడుతున్న కస్టమర్స్ Thu, May 02, 2024, 08:32 PM
భానుడి ఉగ్రరూపం.. సాధారణం కన్నా 2.1 డిగ్రీలు అధికం, జాగ్రత్తలు తీసుకోండి Thu, May 02, 2024, 08:20 PM
ఛత్తీస్‌గఢ్‌‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు తెలంగాణ మావోయిస్టులు మృతి, వీరిపై లక్షల్లో రివార్డు Thu, May 02, 2024, 08:14 PM
ఎన్నికపై వివాదం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డికి హైకోర్టు నోటీసులు Thu, May 02, 2024, 08:11 PM