సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బీభత్సం,,,6 నిమిషాల్లో 6 యాక్సిడెంట్లు

byసూర్య | Wed, Apr 17, 2024, 09:19 PM

మద్యం సేవించి వాహనాలు డ్రైవింగ్ చేయొద్దంటూ పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినా.. చాలా మంది పెడచెవిన పెడుతూ తమ ప్రాణాలతో పాటు మిగతావారి జీవితాలను కూడా రిస్క్‌లో పెడుతున్నారు. పోలీసులు ఎక్కడికక్కడ డ్రంకన్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నా.. ఎలాగోలా తప్పించుకుని మద్యం మత్తులో రోడ్డెక్కి అమాయలను ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో పీకలదాకా మద్యం తాగిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. అర్ధరాత్రి వేళ తన కారుతో ఆరు నిమిషాల్లోనే ఆరు యాక్సిడెంట్లు చేసి.. బీభత్సం సృష్టించాడు. ఐకియా నుంచి రాయదుర్గం పోలీస్‌స్టేషన్ సమీపంలోని కామినేని ఆసుపత్రి వరకు ఉన్న మార్గంలో జరిగిన ఈ ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందగా.. 11 మంది గాయపడ్డారు.


మొదటి ప్రమాదం అర్థరాత్రి 12 గంటల 45 నిమిషాలకు మైండ్‌స్పేస్ సమీపంలో జరగ్గా.. చివరిది 12.51 గంటలకు జరిగింది. నిజాంపేట ప్రగతినగర్‌కు చెందిన పాతర్ల క్రాంతికుమార్‌ యాదవ్‌ అనే యువకుడు ఆదివారం రాత్రి మద్యం తాగాడు. ఆ మత్తులోనే కారులో బయల్దేరగా.. ఐకియా రోటరీ దగ్గర.. ఎదురుగా ఉన్న కారును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అందులోని మహిళ స్వల్పంగా గాయపడింది. భయంతో పారిపోయేందుకు స్పీడ్ పెంచిన క్రాంతికుమార్.. గచ్చిబౌలి బాబూఖాన్‌ లేన్‌ దగ్గర ఓ బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఒకరి కాలు విరిగిపోగా.. ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.


మళ్లీ అక్కడి నుంచి పిస్తా హౌజ్‌ ఎదురుగా నడుస్తూ వెళ్తున్న మరో యువకుడిని ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆ యువకుడిని స్ఠానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. వరుసగా యాక్సిడెంట్లు అవుతున్నా.. ఎక్కడా ఆగని క్రాంతికుమార్ రాయదుర్గం పోలీస్‌స్టేషన్ సమీపంలోని కిమ్స్ ఆస్పత్రి దగ్గర మరో బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఇద్దరు గాయపడగా.. కారును మరింత వేగంగా పోనిచ్చి కొద్దిదూరంలోనే ఇంకో బైక్‌ను ఢీకొట్టాడు. అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లే క్రమంలో ఆటోను ఢీకొట్టగా.. అందులోని ముగ్గురు గాయపడ్డారు.


నడిరోడ్డుపై విచక్షణ కోల్పోయి డ్రైవింగ్ చేయడమే కాకుండా.. అనేకమందిని గాయపరిచిన క్రాంతికుమార్‌ను కొందరు యువకులు వెంటాడి మల్కంచెరువు వద్ద అడ్డుకున్నారు. అతడిని కారులో నుంచి బయటకు లాగి దేహశుద్ధి చేసి.. పోలీసులకు అప్పగించారు. నిందితుడిని రాయదుర్గం స్టేషన్‌కు తరలించిన పోలీసులు.. బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయగా రీడింగ్ ఏకంగా 550 వచ్చింది. దీంతో.. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.


30 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగి క్రాంతి కుమార్.. మద్యం మత్తులో.. జూబ్లీహిల్స్ నుంచి మాదాపూర్ మీదుగా నిజాంపేటకు వెళుతుండగా.. వోక్స్‌వ్యాగన్ పోలోలో మైండ్‌స్పేస్ నుంచి మెహిదీపట్నం రోడ్డుకు వెళ్తుండగా.. మూడు బైకులు, ఒక కారు, ఒక ఆటోతో పాటు పాదచారులను కూడా ఢీకొట్టాడని పోలీసులు తెలిపారు.


Latest News
 

లవర్‌తో ఓయో రూమ్‌కు.. తెల్లారేసరికి విగతజీవిగా యువకుడు, ఏం జరిగింది? Tue, Apr 30, 2024, 09:05 PM
హైదరాబాద్‌లో లేడీ డాన్,,,గుట్టు చప్పుడు కాకుండా గేమింగ్ Tue, Apr 30, 2024, 08:10 PM
అన్నదాతకు గుడ్‌న్యూస్.. రైతుబంధు నిధులపై డిప్యూటీ సీఎం భట్టి కీలక ప్రకటన Tue, Apr 30, 2024, 08:05 PM
5 వేల పింఛన్, 5 లక్షల ఆర్థిక సాయం.. తాగుబోతుల సంక్షేమ సంఘం డిమాండ్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే! Tue, Apr 30, 2024, 08:01 PM
వియ్యంకుడి కోసం రంగంలోకి విక్టరీ వెంకటేశ్.. ఆ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం Tue, Apr 30, 2024, 07:41 PM