దంచికొడుతున్న ఎండలు..ఆర్టీసీ కీలక నిర్ణయం

byసూర్య | Tue, Apr 16, 2024, 07:35 PM

తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 7 నుంచి భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 9 తర్వాత రోడ్లపై జన సంచారం తగ్గుతోంది. సూర్యుడు నిప్పుల వర్షం కురిపించటంతో పాటు భానుడి భగభగలతో ప్రజలు అల్లాడి పోతున్నారు. వీడగాలులతో ఇబ్బందులు పడుతున్నారు. ఎండల తీవ్రత తాజాగా TSRTCపై పడింది. ఎండలు మండుతుండటంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.


హైదరాబాద్‌లో రోజురోజుకు ఎండలు పెరుగుతుండటంతో గ్రేటర్ పరిధిలో బస్సుల సంఖ్య తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. ఎండల ప్రభావం ఎక్కువగా ఉండే మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బస్సుల సంఖ్యను తగ్గించనున్నట్లు అధికారులు తెలిపారు. ఎండల తీవ్రతతో మధ్యాహ్నాం వేళల్లో ప్రయాణికులు తక్కువగా ఉంటున్నారని అందుకే తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. ఈనెల 17 నుంచి బస్సు సర్వీసుల తగ్గింపు అమల్లోకి రానున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ జోన్ ఈడీ తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని అర్ధం చేసుకోవాలని సూచించారు.


కాగా, నేడు, రేపు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ అధికారులు తెలిపారు. ప్రస్తుతం 42 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండగా.. వచ్చే రెండ్రోజులు అదనంగా మరో రెండు డిగ్రీల మేర పెరిగే ఛాన్స్ ఉందని అన్నారు. వడగాలులు కూడా వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 మధ్య అత్యవసరమైతే బయటకు రావాలని లేదంటే ఇళ్లకే పరిమితం కావాలన్నారు.


Latest News
 

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడున్నరేళ్ల నిరీక్షణకు తెర Mon, Apr 29, 2024, 09:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత, ఈ రెండ్రోజులు జాగ్రత్త Mon, Apr 29, 2024, 09:48 PM
రీజినల్‌ రింగురోడ్డుతో మరింత అభివృద్ధి.. మా భవిష్యత్ ప్రణాళికలు ఇవే: సీఎం రేవంత్ Mon, Apr 29, 2024, 09:10 PM
కాంగ్రెస్‌లోకి గుత్తా అమిత్.. మరి తండ్రి పరిస్థితేంటి Mon, Apr 29, 2024, 09:04 PM
73 ఏళ్ల నాటి కేసును పరిష్కరించిన తెలంగాణ హైకోర్టు.. నిజాం కాలం నాటి ఈ వివాదమేంటి. Mon, Apr 29, 2024, 08:59 PM