నిప్పుల కుంపటిగా తెలంగాణ.. 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత, ఈ రెండ్రోజులు జాగ్రత్త

byసూర్య | Mon, Apr 29, 2024, 09:48 PM

తెలంగాణలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మండే ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 7 నుంచే భానుడి భగభగలు మెుదలవుతున్నాయి. తీవ్రమైన ఎండ, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మధ్యాహ్నం తర్వాత రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. అన్ని జిల్లాల్లో సాధారణం కన్నా దాదాపు ఐదు డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొద్ది రోజులుగా ప్రమాద హెచ్చరిక స్థాయి 45 డిగ్రీల మార్కును దాటి ఎండలు దంచికొడుతున్నాయి. ఆదివారం కూడా ఆరు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 45.4 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ జిల్లాలోని చాలా మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, జగిత్యాల, వనపర్తి జిల్లాల్లోని పలు మండలాల్లో 45 నుంచి 45.3 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మహబూబాబాద్‌, నిజామాబాద్‌ సహా పలు జిల్లాల్లో 44.9 డిగ్రీల ఎండ తీవ్రత కొనసాగింది. ఖమ్మం, ములుగు జిల్లాల్లో వడగాలులు వీచినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణలో సోమ, మంగళవారాల్లో ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతుందని అన్నారు. కొన్ని జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(IMD) పేర్కొంది.


తీవ్రమైన ఎండలతో వడదెబ్బ ప్రమాదం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. వడదెబ్బకు గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. ఉదయం 11 నుంచి 4 గంటల మధ్య బయటకు వెళ్లకపోవటమే ఉత్తమమని చెబుతున్నారు. మద్యానికి దూరంగా ఉండాలని.. తరుచూ నీటిని తాగాలని సూచిస్తున్నారు.


Latest News
 

రెండు ఐచర్ వాహనాలు ఢీ.. నలుగురికి తీవ్ర గాయాలు Thu, May 16, 2024, 08:07 PM
అయిజ సహకార సంఘాన్ని ఆదర్శంగా తీసుకోవాలి Thu, May 16, 2024, 08:00 PM
డిజిపికి ఫిర్యాదు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ Thu, May 16, 2024, 07:59 PM
క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే Thu, May 16, 2024, 07:46 PM
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి Thu, May 16, 2024, 07:45 PM