టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడున్నరేళ్ల నిరీక్షణకు తెర

byసూర్య | Mon, Apr 29, 2024, 09:54 PM

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. మూడునన్నరేళ్ల నిరీక్షణకు తెరపడనుంది. రుణపరపతి సహకార సంఘం లో దాచుకున్న పొదుపు సొమ్మును వెనక్కి తీసుకునేందుకు ఆర్టీసీ కార్మికులకు త్వరలోనే ఊరట లభించనుంది. ఇప్పటికే వచ్చిన అఫ్లికేషన్లను పరిష్కరించి చెల్లింపులు ప్రారంభించాలని సీసీఎస్‌ నిర్ణయించింది. వారం రోజుల్లోపే ఈ ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉందని సీసీఎస్‌ వర్గాలు వెల్లడించాయి. టీఎస్‌ఆర్టీసీలోని ఉద్యోగులు, కార్మికులు కలిసి రుణపరపతి సహకార సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నెలనెలా వేతనంలోంచి కొంత సొమ్మును ఉద్యోగులు సీసీఎస్‌లో పొదుపు చేసుకుంటారు. అవసరం వచ్చినప్పుడు తక్కువ వడ్డీతో రుణం తీసుకుంటారు. సభ్యత్వం రద్దు చేసుకున్నప్పుడు లేదా ఉద్యోగ విరమణ పొందినప్పుడు వారి సొమ్మంతా వడ్డీతో కలిపి ఉద్యోగులకు వెనక్కి వస్తుంది.


 ఈ సొమ్మును ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం వాడేసుకుంది. దీంతో 2020 అక్టోబరు నుంచి అఫ్లికేషన్లు పెండింగ్‌లో ఉండటంతో కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. గతంలో సీసీఎస్‌లో 51 వేల మంది సభ్యులు ఉంటే.. ఇప్పుడు ఆ సంఖ్య 31 వేలకే పరిమితమైంది. అసలు, వడ్డీ కలిపి ఆర్టీసీ యాజమాన్యం తమకు రూ.1,130 కోట్లు ఇవ్వాలని సీసీఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. ఆర్టీసీ యాజమాన్యం ఎట్టకేలకు స్పందించి ప్రస్తుతానికి రూ.150 కోట్లు చెల్లించింది. కార్మికుల నుంచి వచ్చిన దరఖాస్తుల్లో దాదాపు 10,600 పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో రుణం కోసం వచ్చిమానికి తొలిసారి ఆర్టీసీ బస్సు.. పాటలు పాడుతూ మహిళల ఆనందం


ఉద్యోగ విరమణ చెందిన వారివి వెయ్యి, సభ్యత్వం రద్దు చేసుకున్న ఉద్యోగుల నుంచి 2,800 అఫ్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. లోన్ అఫ్లికేషన్ల కోసం రూ.200 కోట్లు.. రిటైర్మెంటు, సభ్యత్వం రద్దు చేసుకున్నవారికి రూ.90 కోట్లకుపైగా కావాల్సి ఉంటుంది. యాజమాన్యం ఇచ్చినవి రూ.150 కోట్లు కాగా.., సీసీఎస్‌ రూ.150 కోట్లను రుణంగా తీసుకుంటోంది. దీంతో దరఖాస్తుదారులకు అవసరమైన నిధులు సర్దుబాటు అవుతున్నాయని సీసీఎస్‌ ప్రతినిధి వెల్లడించారు. దీంతో ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Latest News
 

దేవరకద్ర వ్యవసాయ మార్కెట్ ధరలు Thu, May 16, 2024, 03:08 PM
పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలి: జిల్లా కలెక్టర్ Thu, May 16, 2024, 03:05 PM
మతిస్థిమితం లేని వ్యక్తి మృతి Thu, May 16, 2024, 03:01 PM
రాజకీయాలు తప్ప రైతుల కష్టాలు పట్టవా?: కేటీఆర్‌ Thu, May 16, 2024, 01:55 PM
ధాన్యం కొనుగోలు చేయాలని నిరసన తెలిపిన రైతులు Thu, May 16, 2024, 01:06 PM