byసూర్య | Thu, May 16, 2024, 03:05 PM
గ్రామాలలో, పట్టణాలలో పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ ఆదేశించారు. బుధవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులు ప్రబల కుండా పారిశుధ్య చర్యలు చేపట్టాలని, మురుగు కాల్వలు శుభ్రం చేయాలని ఆదేశించారు.