మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. వైన్స్, బార్లు బంద్.. ఎప్పటివరకంటే..?

byసూర్య | Tue, Apr 16, 2024, 07:02 PM

మందుబాబులకు బ్యాడ్ న్యూస్. హైదరాబాద్‌లో మద్యం దుకాణాలు బంద్. శ్రీరామనవమి సందర్భంగా రేపు అంటే.. ఏప్రిల్ 17వ తేదీన హైదరాబాద్‌లో వైన్స్ షాపులు బంద్ చేయాలని హైదరాబాద్ సీపీ ఆదేశాలు జారీ చేశారు. అత్యంత భక్తిభావంతో వాడవాడలా రామనామ స్మరణతో శ్రీరామనవమి వేడుకలు జరగనున్న నేపథ్యంలో.. రేపు మద్యం దుకాణాలు బంద్ చేయనున్నారు. రేపు ఉదయం 6 గంటల నుంచి, 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలతో పాటు కల్లు దుకాణాలు, బార్లు బంద్ చేయాలని హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు.


శ్రీరామనవమి పండుగ సందర్భంగా.. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా వైన్ షాపులు మూసివేస్తున్నట్లు సీపీ వెల్లడించారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా మద్యం దుకాణాలు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. దీంతో.. రేపు అంతా మద్యం దుకాణాలు బంద్ ఉంటాయని తెలుసుకున్న మద్యం ప్రియులు.. దగ్గర్లో ఉన్న మద్యం దుకాణాలకు పరుగులు పెడుతున్నారు. రేపటి కోటా కూడా ఈరోజే కొనుగోలు చేసుకుంటున్నారు. ఎండను కూడా లెక్కచేయకుండా వైన్ షాపుల ముందు క్యూ కడుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో బీర్ల కొరత ఏర్పడిందని మద్యం ప్రియులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇదే సమయంలో.. మద్యు దుకాణాలతో పాటు బార్లు, కల్లు దుకాణాలు కూడా ఒక రోజు మొత్తం బంద్ ఉండటంతో.. మందుబాబులకు బ్యాడ్ న్యూస్‌గా మారింది.


Latest News
 

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడున్నరేళ్ల నిరీక్షణకు తెర Mon, Apr 29, 2024, 09:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత, ఈ రెండ్రోజులు జాగ్రత్త Mon, Apr 29, 2024, 09:48 PM
రీజినల్‌ రింగురోడ్డుతో మరింత అభివృద్ధి.. మా భవిష్యత్ ప్రణాళికలు ఇవే: సీఎం రేవంత్ Mon, Apr 29, 2024, 09:10 PM
కాంగ్రెస్‌లోకి గుత్తా అమిత్.. మరి తండ్రి పరిస్థితేంటి Mon, Apr 29, 2024, 09:04 PM
73 ఏళ్ల నాటి కేసును పరిష్కరించిన తెలంగాణ హైకోర్టు.. నిజాం కాలం నాటి ఈ వివాదమేంటి. Mon, Apr 29, 2024, 08:59 PM