కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్రపూజల కలకలం.

byసూర్య | Tue, Apr 16, 2024, 07:06 PM

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ఇంటి పక్కన క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ నందినగర్‌లో ఉన్న కేసీఆర్ ఇంటి పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో.. క్షుద్రపూజలు చేసినట్టుగా ఆనవాళ్లు కనిపించాయి. ఖాళీ స్థలంలో.. ఓ బొమ్మ, నిమ్మకాయలు, మిరపకాయలు, ఓ ప్లాస్టిక్ కవర్‌లో నల్ల కోడి దాని ఈకలతో పాటు చీర ముక్క.. కుంకుమ, పసుపుతో ముగ్గు.. వంటి ఆనవాళ్లు ఉండటం సర్వత్రా కలకలం రేపుతోంది. మంగళవారం ఉదయాన్నే ఈ విషయాన్ని గమనించిన స్థానికులు.. కేసీఆర్ సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులకు తెలిపారు. దీంతో బంజారాహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు.


కేసీఆర్ నివాసానికి అత్యంత సమీపంలో ఈ క్షుద్రపూజలకు సంబంధించిన ఆనవాళ్లు కనిపించటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే.. ప్రస్తుతం కేసీఆర్ నందినగర్‌ నివాసంలో కాకుండా.. తన ఫామ్‌హౌస్‌లో ఉన్నట్లు తెలిసిందే. అయితే.. నందినగర్ ఇంట్లో కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కుటుంబం ఉంటోంది. ఇంతకూ ఇది చేసింది ఎవరూ.. అన్నది పోలీసులు గుర్తించే పనిలో పడ్డారు. ఇది ఎవరైనా ఆకతాయిలు చేశారా.. లేదా ఇంకేవరైనా కావాలనే చేశారా అన్నది తేలాల్సి ఉంది.


ఇదిలా ఉంటే.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ఓడిపోయినప్పటి నుంచి పార్టీలోని కీలక నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతూనే ఉన్నారు. సీనియర్ నేతలైన కే కేశవరావు, కడియం శ్రీహరి లాంటి నేతలు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరోవైపు.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేసీఆర్ కుమార్తె కవిత అరెస్ట్ కావటం ఇప్పుడు.. రాష్ట్రంలో సర్వత్రా చర్చనీయాశంగా మారాయి. ఇవన్నీ అంశాలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని.. కుదిపేస్తున్నాయి.


ఇదంతా ఇలా ఉన్నా.. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో అధిక స్థానాలు గెలిచి.. సత్తా చాటాలని బీఆర్ఎస్ శాయాశక్తులా కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే.. తెలంగాణ భవన్‌లో వాస్తు మార్పులు కూడా చేపట్టారు కేసీఆర్. ఇలాంటి సమయంలోనే ఆయన ఇంటికి అత్యంత సమీపంలో క్షుద్రపూజల ఆనవాళ్లు కనిపించడం ఇఫ్పుడు చర్చనీయాంశంగా మారింది.


Latest News
 

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడున్నరేళ్ల నిరీక్షణకు తెర Mon, Apr 29, 2024, 09:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత, ఈ రెండ్రోజులు జాగ్రత్త Mon, Apr 29, 2024, 09:48 PM
రీజినల్‌ రింగురోడ్డుతో మరింత అభివృద్ధి.. మా భవిష్యత్ ప్రణాళికలు ఇవే: సీఎం రేవంత్ Mon, Apr 29, 2024, 09:10 PM
కాంగ్రెస్‌లోకి గుత్తా అమిత్.. మరి తండ్రి పరిస్థితేంటి Mon, Apr 29, 2024, 09:04 PM
73 ఏళ్ల నాటి కేసును పరిష్కరించిన తెలంగాణ హైకోర్టు.. నిజాం కాలం నాటి ఈ వివాదమేంటి. Mon, Apr 29, 2024, 08:59 PM