దానికోసం కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్రపూజలా..?

byసూర్య | Tue, Apr 16, 2024, 06:58 PM

బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో క్షుద్రపూజలు జరిగినట్లుగా ఉదయం నుంచి అన్ని టీవీ ఛానల్స్, సోషల్ మీడియా మాధ్యమాల్లో.. అందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. దీంతో.. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగించారు. అసలు ఇది చేసింది ఎవరు.. ఎవరైనా ఆకతాయిలు ఈ పని చేశారా.. లేదా నిజంగానే ఇలాంటి పూజలు నిర్వహించారా అన్న అంశాలపై పోలీసులు దర్యాప్తు చేయగా.. అవాక్కయ్యే విషయం వెలుగు చూసింంది.


కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్రపూజలు జరిగాయంటూ వస్తున్న వార్తలు అవాస్తవం అని పోలీసులు నిర్ధారించారు. ఇది కొంతమంది ఆకతాయిల పనిగా పోలీసులు తేల్చారు. వాళ్ల ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం ఈ క్షుద్రపూజలు చేసినట్లుగా అక్కడ వాతావరణం తయారు చేశారని పోలీసులు వెల్లడించారు. పిల్లలు కేవలం రీల్స్ కోసమే ఈ పూజలు చేసినట్టుగా వివరించారు. అక్కడ ఎలాంటి భయానక దృశ్యాలేమీ లేవని.. కూడా చెప్పుకొచ్చారు. రీల్స్ మోజులో పడి లైకుల కోసం యువత ఇలాంటి పనులకు పాల్పడ్డారని... అయితే పక్కనే కేసీఆర్ నివాసం ఉండటంతో ఇది కాస్త చర్చనీయాంశంగా మారిందని పోలీసులు చెప్పుకొచ్చారు.


అయితే.. హైదరాబాద్ నందినగర్‌లోని కేసీఆర్ నివాసం పక్కన ఉన్న ఓ ఖాళీ ప్రదేశంలో.. చేతబడి చేసినట్టుగా ఆనవాళ్లు కనిపించాయి. ఓ బొమ్మ, గుడ్లు, నిమ్మకాయలు, చీర ముక్క.. పసుపు కుంకుమలతో ముగ్గు వేసి ఉండటం.. వీటికి తోడు ఓ ప్లాస్టిక్ కవర్‌లో నల్లకోడి కూడా ఉండటం.. అందరినీ ఆందోళనకు గురి చేసింది. అక్కడ చేతబడి జరిగిందా అన్న అనుమానం కలిగించేలా వాతావరణం ఉండటంతో.. స్థానికులు భయంతో పోలీసులకు సమాచారం చేరవేయగా.. దర్యాప్తు చేసి అదంతా అవాస్తవమని.. కేవలం రీల్స్ కోసం చేసిందేనని తేల్చారు.


ఈ విషయం తెలిసి.. చాలా మంది ఆ పిల్లలను తిడుతున్నారు. ఓరి మీ దుంపలు తెగ.. రీల్స్ కోసం ఇలాంటి పనులు చేస్తారా.. అది కూడా కేసీఆర్ ఇంటి దగ్గర ఇలాంటి పనులు చేస్తారా.. ఇది మాత్రం టూమచ్.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు ఫన్నీగా అనిపించినా.. కొంత ఆందోళన క్రియేట్ చేస్తాయంటూ హితవు పలుకుతున్నారు. కొంచెం పనికొచ్చే రీల్స్ చేయండ్రా అంటూ సూచనలు ఇస్తున్నారు.


Latest News
 

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడున్నరేళ్ల నిరీక్షణకు తెర Mon, Apr 29, 2024, 09:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత, ఈ రెండ్రోజులు జాగ్రత్త Mon, Apr 29, 2024, 09:48 PM
రీజినల్‌ రింగురోడ్డుతో మరింత అభివృద్ధి.. మా భవిష్యత్ ప్రణాళికలు ఇవే: సీఎం రేవంత్ Mon, Apr 29, 2024, 09:10 PM
కాంగ్రెస్‌లోకి గుత్తా అమిత్.. మరి తండ్రి పరిస్థితేంటి Mon, Apr 29, 2024, 09:04 PM
73 ఏళ్ల నాటి కేసును పరిష్కరించిన తెలంగాణ హైకోర్టు.. నిజాం కాలం నాటి ఈ వివాదమేంటి. Mon, Apr 29, 2024, 08:59 PM