byసూర్య | Mon, Apr 08, 2024, 03:07 PM
పాలేరు రిజర్వాయర్ నీటిమట్టం పడిపోవడంతో కొన్నిరోజులుగా ఖమ్మం నగరంలో తాగునీటి సరఫరాలో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. ఓ వైపు భూగర్భజలాలు, మరో పక్క లకారం, మున్నేరులో నీరు పూర్తిగా అడుగంటడంతో నగరంలో తాగునీటి సమస్య ఏర్పడింది. ఈ నేపథ్యంలో సాగర్ నుంచి పాలేరుకు నీరు వదలడంతో అధికారులు పాలేరు నుంచి మున్నేరుకు నీటిని విడుదల చేశారు. దీంతో దానవాయిగూడెం చెక్ డ్యామ్ వద్ద వాటర్ లెవల్ పెరిగి జలకళ సంతరించుకుంది.