byసూర్య | Mon, Apr 08, 2024, 03:06 PM
ఈనెల 10వ తేదీ బుధవారం నుండి 12వ తేదీ శుక్రవారం వరకు మూడు రోజులపాటు శ్రీ కోటమైసమ్మ అమ్మవారి ఆలయములో పవిత్ర బ్రహ్మోత్సవములు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్తల ట్రస్ట్ చైర్మన్ పర్సా పట్టాభి రామారావు సోమవారం తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి కైలాష్ శర్మ, ఈవో వేణుగోపాల చారి, సిబ్బంది మోహన్, సాయి పాల్గొన్నారు.