byసూర్య | Mon, Apr 08, 2024, 03:06 PM
ఖమ్మం ఖిల్లాలో గల మసీదులో ఎంపీ నామ నాగేశ్వరరావు ఆదివారం రాత్రి ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రంజాన్ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తనకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఖమర్, కార్పొరేటర్ షౌకత్ అలీ, ఎండీ కుమార్, శీలంశెట్టి వీరభద్రం, ఎస్కే మక్బుల్, నాయకులు తాళ్లూరి జీవన్, తాళ్లూరి హరీష్ పాల్గొన్నారు.