byసూర్య | Mon, Apr 08, 2024, 01:43 PM
బీఆర్‌ఎస్ పాలనలోనే కరీంనగర్‌లో నిజమైన అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. వినోద్‌కుమార్ ఎంపీగా ఉన్నప్పుడే కరీంనగర్‌కు స్మార్ట్ సిటీ తీసుకొచ్చారని గుర్తుచేశారు. గత ఎన్నికల్లో బండి సంజయ్‌ను ఎంపీగా గెలిపిస్తే కరీంనగర్‌కు పైసా తీసుకురాలేదని విమర్శించారు. వినోద్ కుమార్ మళ్లీ గెలిస్తే కరీంనగర్ నియోజకవర్గానికి నిధులు తీసుకొస్తారని చెప్పారు.