బీఆర్ఎస్‌కు ఊహించని షాక్.. ఎన్నికల బరి నుంచి తప్పుకున్న కడియం కావ్య

byసూర్య | Fri, Mar 29, 2024, 09:59 PM

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్నాకొద్దీ.. బీఆర్ఎస్‌కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఓవైపు.. పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతుంటే.. మరోవైపు పార్టీలోని కీలక నేతలు కాంగ్రెస్ పార్టీకి క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే పార్టీలోని అగ్రనేత, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు, ఆయన కుమార్తె, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్‌లోకి వెళ్తున్నట్టు అధికారికంగా ప్రకటించేశారు. కేకే ప్రకటనతోనే పార్టీ శ్రేణులు షాక్‌లో ఉంటే.. మాజీ మంత్రి కడియం శ్రీహరి కుమార్తె, వరంగల్ లోక్ సభ అభ్యర్థి కడియం కావ్య ఊహించని ట్విస్ట్ ఇచ్చారు.


తాను లోక్‌సభ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు కడియం కావ్య ప్రకటించారు. ఈ మేరకు గురువారం రాత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు లేఖ రూపంలో ఈ విషయాన్ని తెలియజేశారు. అయితే.. లేఖలో బీఆర్ఎస్‌పై కడియం కావ్య సంచలన ఆరోపణలు చేయటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అవినీతి ఆరోపణలు, భూకబ్జాలు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, లిక్కర్ కుంభకోణం కేసులతో బీఆర్ఎస్ ప్రతిష్ఠ పూర్తిగా దిగజారిపోయిందని లేఖలో కావ్య పేర్కొన్నారు.


వీటితో పాటు.. జిల్లాలోని నాయకుల మధ్య సమన్వయం, సహకారం లేకపోవడం.. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరించడం పార్టీకి మరింత నష్టం చేస్తున్నాయని కావ్య తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో తాను పోటీ నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నట్లు లేఖలో కావ్య వివరించారు. ఇదే విషయాన్ని కడియం శ్రీహరి కూడా ధ్రువీకరించారు.


కాగా.. తండ్రీకూతుళ్లకు కాంగ్రెస్ నుంచి ఆహ్వానం అందగా.. దాన్ని తిరస్కరించి బీఆర్ఎస్‌ నుంచి వరంగల్ ఎంపీ టికెట్ అందుకున్నారు. అయితే.. లోక్ సభ టికెట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవటంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. మరి.. ఈ తండ్రీకూతుళ్లు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతారా.. లేదా కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవుతారా అన్న చర్చకు తెర లేచింది. మరోవైపు.. వరంగల్ సీటును కాంగ్రెస్ పార్టీ హోల్డ్‌లో పెట్టటం గమనార్హం. దీంతో.. కాంగ్రెస్‌లో చేరి కడియం శ్రీహరే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారన్న వార్తలు వస్తున్నాయి.


Latest News
 

బోనాల వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి Mon, Apr 29, 2024, 12:43 PM
భూత్పూర్ లో కొండ ఇంటింటి ప్రచారం Mon, Apr 29, 2024, 12:41 PM
బూటకపు ఎన్ కౌంటర్లతో మందిని చంపాడు: మల్లు రవి Mon, Apr 29, 2024, 12:39 PM
వనపర్తిలో మూడు జిల్లాల సీపీఎం సమావేశం Mon, Apr 29, 2024, 12:37 PM
మేడే గోడపత్రికల ఆవిష్కరణ Mon, Apr 29, 2024, 12:31 PM