సీఎం, మంత్రుల జిల్లాలివే

byసూర్య | Thu, Dec 07, 2023, 11:06 AM

తెలంగాణలో కొత్త ప్రభుత్వం నేడు కొలువుతీరుతుంది. ప్రస్తుతం ఏర్పడిన మంత్రివర్గ సభ్యుల జిల్లాల వివరాలిలా ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లా, సీతక్క, కొండా సురేఖ ఉమ్మడి వరంగల్, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఉమ్మడి కరీంనగర్, దామోదర రాజనర్సింహ్మ ఉమ్మడి మెదక్ జిల్లా.
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి నేడు మధ్యాహ్నం 1:42 గంటలకు HYDలోని ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి ఇప్ప‌టికే కాంగ్రెస్ అగ్ర‌నేత‌లు, ఇతర రాష్ట్రాల నేతలకు ఆహ్వానం పంపారు. అలాగే మాజీ ముఖ్య‌మంత్రులు కేసీఆర్‌, చంద్ర‌బాబు స‌హా తెలంగాణ ఉద్యమంలో అమరుల కుటుంబాలకు ఆహ్వానం పంపనున్నారు. కేసీఆర్ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంటారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
తెలంగాణ ముఖ్యమంత్రిగా సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి రేపు ప్ర‌మాణం చేయనున్నారు. ప్ర‌మాణ స్వీకారం అనంతరం ఆయ‌న దేనిపై తొలి సంత‌కం చేయనున్నారని ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలపై సంతకాలు చేసే అవకాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ ప‌థ‌కాల అమ‌లుకు దాదాపు రూ.88 వేల కోట్లు అవసరం అవుతాయ‌ని అంచ‌నా. సీఎం హోదాలో రేవంత్ ఏ వర్గానికి శుభవార్త చెప్పనున్నారో?  మధ్యాహ్నం వ‌ర‌కు వేచి చూడాలి.


Latest News
 

శ్రీ వాల్మీకి మహర్షి జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకోవాలి Fri, Oct 18, 2024, 02:23 PM
వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వచ్చేలా యూనియన్ కృషిచేస్తుంది Fri, Oct 18, 2024, 02:13 PM
ఉపాధ్యాయ MLC ఓటు నమోదు కార్యక్రమం Fri, Oct 18, 2024, 02:09 PM
ఆలయాలపై దాడులు చేసిన వారిని శిక్షించాలి Fri, Oct 18, 2024, 01:48 PM
జూరాలకు పెరిగిన ఇన్ ఫ్లో Fri, Oct 18, 2024, 01:48 PM