వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వచ్చేలా యూనియన్ కృషిచేస్తుంది

byసూర్య | Fri, Oct 18, 2024, 02:13 PM

వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వచ్చేలా యూనియన్ పనిచేస్తుందని టీయూడబ్ల్యూజె -ఐజేయూ రాష్ట్ర కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం  జిల్లా పరిధిలోని శేరిలింగంపల్లిలో ఇళ్ల స్థలాల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొండా విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.జర్నలిస్టుల సమస్య పరిష్కారానికి నాటి నుండి నేటి వరకు దశాబ్దాల కాలంగా యూనియన్ పని చేస్తుందన్నారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి చొరవతో సొసైటీలతో సంభంధం లేకుండా పనిచేసే జర్నలిస్టుల గుర్తింపు ప్రక్రియను ప్రారంభించి,ఇళ్ల స్థలాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు.
మొదటగా శేరిలింగంపల్లి నుండి శ్రీకారం చుడుతున్నట్టు పేర్కొన్నారు. వీటితో పాటు హెల్త్ కార్డుల విషయంలో కూడా యూనియన్ చొరవ చూపుతుందని అన్నారు.పని చేసే ప్రతి జర్నలిస్ట్ నిర్దేశించిన ప్రొఫార్మాలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎండి సలీమ్ పాషా మాట్లాడుతూ జర్నలిస్టుల చిరకాల వాంఛ త్వరలో తిరనుందన్నారు.ఆ దిశగా కృషి చేస్తున్న చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి,రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ,కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డిలకు నియోజకవర్గ జర్నలిస్టుల తరుపున ధన్యవాదాలు తెలిపారు.
శేరిలింగంపల్లి యూనియన్ అధ్యక్షులు కొండా విజయ్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గములో వర్కింగ్ జర్నలిస్టులు వెంటనే తమదరఖాస్తులు సమర్పించాలన్నారు.రెండు మూడు రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసి సమగ్ర వివరాలను జిల్లా యూనియన్ కు పంపటం జరుగుతుందన్నారు...ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లానేతలు శ్రీనివాస్ గౌడ్,సత్యనారాయణ,క్రమ శిక్షణ కమిటీ  కన్వీనర్ మాధవరెడ్డి,సభ్యులు దూపం ప్రసాద్,శ్యామ్, శేరిలింగంపల్లి యూనియన్ వైస్ ప్రెసిడెంట్లు అశోక్ యాదవ్, ప్రణయ్,శ్రీనివాస్,కోశాధికారి వరుణ్,ఆర్గనైజింగ్ సెక్రటరీ యాసిన్, సంయుక్త కార్యదర్శులు నాగరత్నం, నరేష్,గోవర్ధన్ రెడ్డి,ప్రవీణ్,,కార్యావర్గ సభ్యులు శంకర్,సతీష్,
సీనియర్ జర్నలిస్టులు నాగేష్,మూర్తి,భూమేశ్,లక్ష్మన్ ప్రవీణ్,శశి,అనిల్ రెడ్డి,నర్సింలు,టిల్లు పాల్గొన్నారు.


Latest News
 

స్వయం సహాయ సంఘాల సభ్యులకు రూ.2 లక్షలు ఇస్తున్నామన్న సీతక్క Fri, Oct 18, 2024, 04:44 PM
అనివార్య కారణాల వల్ల కేటీఆర్ హాజరు కాలేకపోయారన్న న్యాయవాది Fri, Oct 18, 2024, 04:42 PM
రేపు ఉదయం తొమ్మిది గంటలకు మూసీ పరీవాహక ప్రాంతం వద్దకు వెళ్దామన్న హరీశ్ రావు Fri, Oct 18, 2024, 04:41 PM
పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఓ వ్యక్తి అక్కడే ఒంటిపై పెట్రోల్ పోసుకొని .. Fri, Oct 18, 2024, 04:32 PM
లక్ష్మి నగర్ కాలనీ, కల్వర్టు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే Fri, Oct 18, 2024, 04:30 PM