అనివార్య కారణాల వల్ల కేటీఆర్ హాజరు కాలేకపోయారన్న న్యాయవాది

byసూర్య | Fri, Oct 18, 2024, 04:42 PM

వాంగ్మూలం తీసుకుంటామని చెప్పినప్పటికీ మళ్లీ సమయం ఎలా కోరుతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను నాంపల్లి కోర్టు ప్రశ్నించింది. మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. ఈ పిటిషన్‌పై ఇటీవల విచారణ జరిపిన నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం ఈరోజు కేటీఆర్ సహా సాక్షుల వాంగ్మూలాన్ని నమోదు చేస్తామని తెలిపింది. అయితే కేటీఆర్ కోర్టుకు హాజరు కాలేదు.అనివార్య కారణాల వల్ల కేటీఆర్ ఈరోజు వాంగ్మూలం నమోదు చేయడానికి కోర్టుకు హాజరు కాలేపోతున్నారని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. వాంగ్మూలం నమోదు చేయడానికి సమయం ఇవ్వాలని కోరారు. సోమవారం లేదా బుధవారం సమయం ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ సమయంలోనే... ఈరోజు వాంగ్మూలం తీసుకుంటామని చెప్పినప్పటికీ మళ్లీ సమయం కోరడమేమిటని కోర్టు ప్రశ్నించింది. అనంతరం బుధవారం కేటీఆర్ స్టేట్‌మెంట్ రికార్డ్ చేస్తామని స్పష్టం చేసింది.


Latest News
 

మూసీపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ Fri, Oct 18, 2024, 06:50 PM
మూసీ నది ప్రాజెక్టుపై రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ నేత కౌంటర్‌ ఛాలెంజ్‌ Fri, Oct 18, 2024, 06:40 PM
జీవో 29ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ Fri, Oct 18, 2024, 05:12 PM
స్వయం సహాయ సంఘాల సభ్యులకు రూ.2 లక్షలు ఇస్తున్నామన్న సీతక్క Fri, Oct 18, 2024, 04:44 PM
అనివార్య కారణాల వల్ల కేటీఆర్ హాజరు కాలేకపోయారన్న న్యాయవాది Fri, Oct 18, 2024, 04:42 PM