స్వయం సహాయ సంఘాల సభ్యులకు రూ.2 లక్షలు ఇస్తున్నామన్న సీతక్క

byసూర్య | Fri, Oct 18, 2024, 04:44 PM

మూసీ నీళ్లతో స్నానం చేసేలా, తాగేలా తాము బాగు చేస్తామని మంత్రి సీతక్క అన్నారు. మూసీ పరీవాహక స్వయం సహాయ సంఘాల సభ్యులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చెక్కులను సీతక్క పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మూసీ నది ప్రక్షాళనపై ప్రతిపక్షాల నుంచి వస్తోన్న విమర్శలపై స్పందించారు. మూసీ పరీవాహక స్వయం సహాయ సంఘాల మహిళలకు తాము చేయూతనిస్తున్నామన్నారు.172 స్వయం సహాయ సంఘాల సభ్యులకు రూ.3.44 కోట్ల రుణాలు ఇస్తున్నట్లు చెప్పారు. మనం జీవించే పరిసరాలు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. అందుకే మూసీ ప్రక్షాళన చేపట్టామన్నారు. మూసీ నిర్వాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామన్నారు. మూసీ నిర్వాసితుల్లోని ఒక్కో మహిళకు రూ.2 లక్షలు ఇస్తున్నట్లు చెప్పారు. ఇందులో రూ.1.4 లక్షలు ఉచితంగా ఇస్తున్నామని, మిగతా మొత్తం నెలకు రూ.2 వేలు మూడేళ్ల పాటు చెల్లించాలన్నారు.


Latest News
 

స్కిల్ యూనివర్సిటీకి అదానీ రూ.100 కోట్ల విరాళం Fri, Oct 18, 2024, 08:50 PM
అదానీ ఫౌండేషన్ తరఫున ఈ మొత్తాన్ని అందించిన అదానీ గ్రూప్ అధినేత Fri, Oct 18, 2024, 07:56 PM
రేవంత్ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత రావాలని మంత్రులే చూస్తున్నారన్న సంజయ్ Fri, Oct 18, 2024, 07:52 PM
మూసీపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ Fri, Oct 18, 2024, 06:50 PM
మూసీ నది ప్రాజెక్టుపై రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ నేత కౌంటర్‌ ఛాలెంజ్‌ Fri, Oct 18, 2024, 06:40 PM