మూసీపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్

byసూర్య | Fri, Oct 18, 2024, 06:50 PM

మూసీ మురికికూపంగా మారడానికి సింహభాగం కాంగ్రెస్ ప్రభుత్వాలు కారణమైతే, కొద్దిభాగం టీడీపీ ప్రభుత్వానిదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ భవన్‌లో మూసీపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తాము మూసీ నదిని కరకట్టలతో కాపాడాలని భావించామన్నారు. మూసీ మురికికూపంగా మారింది బీఆర్ఎస్ హయాంలో కాదన్నారు. మురికికూపంగా మారడానికి గత ప్రభుత్వాలు కారణమన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నానని చురక అంటించారు.మూసీ సుందరీకరణ కోసం లక్షన్నర కోట్ల రూపాయలు పెట్టి దోపిడీ చేయాల్సిన అవసరం లేదని విమర్శించారు. మూసీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలనుకుంటోంది బ్యూటిఫికేషన్ కాదని... లూటిఫికేషన్ అని ఆరోపించారు. మూసీ సుందరీకరణ అనే పదం తొలుత ఉపయోగించింది రేవంత్ రెడ్డే అన్నారు. కానీ ఇప్పుడు మూసీ ప్రక్షాళన అని చెబుతున్నారని మండిపడ్డారు. మూసీ విషయంలో రేవంత్ రెడ్డి అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారన్నారు. నేవీ రాడర్ కేంద్రంతో మూసీకి ఉరి వేయాలని చూస్తున్నారని ఆరోపించారు.నాచారం, జీడిమెట్ల‌, బాలాన‌గ‌ర్, మ‌ల్లాపూర్ నుంచి కొన్ని వ్య‌ర్థాలు 90 శాతానికి పైగా మూసీలో కలుస్తున్నాయని తెలిపారు. కాలుష్యం బారినపడి మురికికూపంగా మారిన భారతదేశ నదుల్లో మూసీ అగ్రభాగాన ఉందన్నారు. 2015 నివేదికనే ఈ విషయం చెబుతోందని, తాము అధికారంలోకి వచ్చింది 2014లో అని గుర్తు చేశారు. ఏడాది కాలంలోనే తాము మురికికూపంగా మార్చలేదన్నారు.1908లో వ‌ర‌ద‌లు వ‌చ్చిన‌ప్పుడు మోక్ష‌గుండం విశ్వేశ్వ‌ర‌య్య‌ డిజైన్ చేసిన రిజ‌ర్వాయ‌ర్లు, పార్కులు త‌ప్ప... ఆ తర్వాత కేసీఆర్ వచ్చే వరకు ఏ ప్ర‌భుత్వమూ మూసీకి సంబంధించి ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టలేదన్నారు. కేసీఆర్ వ‌చ్చాక సెంట్ర‌ల్ పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డు రిపోర్ట్ తెప్పించుకున్నట్లు చెప్పారు. బీవోడీ, సీవోడీ ఈ రెండింటిలో కూడా మూసీ ప్రమాదకరస్థాయిలో ఉంద‌ని నివేదికలు వెల్లడించాయన్నారు. 2016 దాకా మున్సిప‌ల్ మినిస్ట‌ర్‌గా కేసీఆర్ ఉన్నారని, ఆ త‌ర్వాత తాను బాధ్య‌త‌లు చేపట్టానన్నారు. కేసీఆర్ మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో అక్క‌డ ఉండే ప‌రిస్థితుల‌ను అధ్య‌య‌నం చేసి పున‌రుజ్జీవం, సుంద‌రీక‌ర‌ణ చేసే విధంగా సంక‌ల్పించామన్నారు.


Latest News
 

జిహెచ్ఎంసి నూతన ఏఈని కలిసిన కార్పొరేటర్ మెట్టు కుమార్ Fri, Oct 18, 2024, 08:57 PM
కేటీఆర్, హరీశ్ రావుకు కౌంటర్ ఇచ్చిన మంత్రి సీతక్క Fri, Oct 18, 2024, 08:57 PM
ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి.. కలెక్టర్ Fri, Oct 18, 2024, 08:56 PM
ఐకెపి సెంటర్ ను ప్రారంభించిన టేక్మాల్ మండల అధికారులు Fri, Oct 18, 2024, 08:55 PM
దాన్యం కొనుగోలుకు సన్నద్ధం కావాలి: అదనపు కలెక్టర్ గంగ్వార్ Fri, Oct 18, 2024, 08:54 PM