రేపు ఉదయం తొమ్మిది గంటలకు మూసీ పరీవాహక ప్రాంతం వద్దకు వెళ్దామన్న హరీశ్ రావు

byసూర్య | Fri, Oct 18, 2024, 04:41 PM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు సవాల్ విసిరారు. రేపు ఉదయం తొమ్మిది గంటలకు గన్‌మన్‌లు లేకుండా మూసీ పరీవాహక ప్రాంతం వద్దకు, ఆ తర్వాత కొండపోచమ్మ, మల్లన్నసాగర్, రంగనాయక సాగర్‌కు వెళ్దామని... అక్కడి వారిని కలిసి మాట్లాడుదామన్నారు. రేపు కుదరదంటే టైమ్... డేట్ మీరు నిర్ణయిస్తారా? నన్ను నిర్ణయించమంటారా? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి నిన్న పెట్టిన ప్రెస్ మీట్‌పై ఆయన తీవ్రంగా స్పందించారు.ముఖ్యమంత్రి గారికి నేను ఛాలెంజ్ విసురుతున్నాను. మీరు డేట్ నిర్ణయిస్తారా? నన్ను నిర్ణయించమంటారా? పోదాం... రేపు రమ్మంటే ఉదయం తొమ్మిది గంటలకు మీ ఇంటికి వస్తాను... లేదు మీకు ఏదైనా బిజీ షెడ్యూల్ ఉందంటే ఇంకో డేట్ టైమ్... మీరే ఇవ్వండి. కారు నేనే డ్రైవింగ్ చేస్తాను. నువ్వు పక్కన కూర్చో... ఇద్దరమే వెళ్దాం... గన్‌మన్‌లు లేకుండా వెళదామని చెప్పావు కదా... అక్కడి నుంచి నేరుగా మూసీ పరీవాహక ప్రాంతం వద్దకు వెళ్లి... అక్కడి బాధితులను కలుద్దాం... అక్కడి నుంచి కొండపోచమ్మ సాగర్‌కు వెళదాం... అక్కడి నుంచి మల్లన్న సాగర్ వద్దకు వెళదాం... అక్కడి నుంచి రంగనాయక సాగర్ వెళదాం... రేపు వెళదామా? ఎల్లుండి వెళదామా? రేపు ఉదయం తొమ్మిది గంటలకు నేను రెడీ" అని సవాల్ చేశారు.అబద్ధమే ఆశ్చర్యపడేలా రేవంత్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టారని విమర్శించారు. సీఎం ఎలాంటి ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మూసీకి ఆయన ఇచ్చిన నిర్వచనాలు విని జనం నవ్వుకుంటున్నారన్నారు. ప్రెస్ మీట్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఏఐ టెక్నాలజీని చూపించారన్నారు. నీటితో కళకళలాడేలా నదిని బాగు చేయడమే పునరుజ్జీవమన్నారు. రివర్ ఫ్రంట్ అంటే ఏమిటి? దాని స్టంట్ ఏమిటో ముఖ్యమంత్రి చెప్పాలన్నారు.నదిని శుభ్రం చేయడం నుంచే పనులు ప్రారంభం కావాలన్నారు. మూసీ సుందరీకరణలో భాగంగానే తాము 31 ఎస్టీపీలు నిర్మించామని తెలిపారు. మూసీలో పారిశ్రామిక వ్యర్థాలు కలవకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అసలు పని వదిలిపెట్టి హైడ్రా పేరుతో ఇళ్లు కూల్చడంపై దృష్టి సారించారని మండిపడ్డారు


Latest News
 

మూసీపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ Fri, Oct 18, 2024, 06:50 PM
మూసీ నది ప్రాజెక్టుపై రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ నేత కౌంటర్‌ ఛాలెంజ్‌ Fri, Oct 18, 2024, 06:40 PM
జీవో 29ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ Fri, Oct 18, 2024, 05:12 PM
స్వయం సహాయ సంఘాల సభ్యులకు రూ.2 లక్షలు ఇస్తున్నామన్న సీతక్క Fri, Oct 18, 2024, 04:44 PM
అనివార్య కారణాల వల్ల కేటీఆర్ హాజరు కాలేకపోయారన్న న్యాయవాది Fri, Oct 18, 2024, 04:42 PM