రేవంత్ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ వస్తారా..?

byసూర్య | Thu, Dec 07, 2023, 11:06 AM

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి నేడు మధ్యాహ్నం 1:42 గంటలకు HYDలోని ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి ఇప్ప‌టికే కాంగ్రెస్ అగ్ర‌నేత‌లు, ఇతర రాష్ట్రాల నేతలకు ఆహ్వానం పంపారు. అలాగే మాజీ ముఖ్య‌మంత్రులు కేసీఆర్‌, చంద్ర‌బాబు స‌హా తెలంగాణ ఉద్యమంలో అమరుల కుటుంబాలకు ఆహ్వానం పంపనున్నారు. కేసీఆర్ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంటారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
గురువారం మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి గులాబీ దళపతి కేసీఆర్ హాజరవుతారా లేదా అన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రేవంత్ ఆయనకున్న రాజకీయ భేదాభిప్రాయాలు, ఎన్నికల్లో ఘోర ఓటమి దృష్ట్యా కేసీఆర్ బహుశా రాకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ సైతం ఎన్నికల ప్రచారంలో కేసీఆర్పై పలుమార్లు విరుచుకుపడిన సంగతి తెలిసిందే.


Latest News
 

ఇద్దరు యూట్యూబర్‌లపై కేసు నమోదు Fri, Oct 18, 2024, 11:52 AM
ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు తొలగించాలని హైడ్రా నిర్ణయం Fri, Oct 18, 2024, 10:55 AM
శబరిమల వరకు మహా పాదయాత్ర Fri, Oct 18, 2024, 10:44 AM
ఇకపై ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ చెల్లింపులు Fri, Oct 18, 2024, 10:21 AM
తెలంగాణ గ్రూప్ I పరీక్షతో ముందుకు సాగాలని ఆశావహుల నిరసన కొనసాగుతోంది Thu, Oct 17, 2024, 10:14 PM