పోలింగ్ తర్వాత బర్రెలక్క మిస్సింగ్,,,,అజ్ఞాతంలోకి వెళ్లిందంటూ వార్తలు,,,,వెలుగులోకి శిరీష ఆడియో

byసూర్య | Sat, Dec 02, 2023, 06:56 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక్లలో ఈసారి ప్రధాన అభ్యర్థులతో పాటు బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష కూడా మీడియా అటెన్షన్‌ను తనవైపు తిప్పుకుంది. ఎంత చదివినా ఉద్యోగాలు రావటం లేదంటూచేసిన ఓ వీడియో వైరల్ కావటంతో వెలుగులోకి వచ్చారు బర్రెలక్క. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగుల గొంతుకగా ఆమె కొల్లాపూర్ నియోజవర్గం నుంచి బరిలోకి దిగారు. నవంబర్ 30న పోలింగ్ ముగియగా.. రేపు ఫలితాలు వెల్లడికానున్నాయి. తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఎవరు సీఎం అవుతారు? అనే విషయాలతో పాటు బర్రెలక్క గెలుస్తుందా ? అన్న అంశం కూడా తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారింది.


అయితే నవంబర్ 30న పోలింగ్ ముగియగా.. ఆ మరుసటి రోజు నుంచి ఆమె కనిపించకుండా పోయారు. ఫోన్ కాల్‌లోనూ ఆమె అందుబాటులోకి రాలేదు. దీంతో బర్రెలక్క అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని.. ఆమెకు గెలుపు అవకాశాలు ఉండటంతో పలు పార్టీల నేతలు ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారనే టాక్ పొలిటకల్ సర్కిల్‌లో వినిపిస్తోంది. ఇదిలా ఉండగా.. ఆమె ఎక్కడ ఉందో.. ఎందుకోసం కనిపించకుండా పోయిందో.. తదితర వివరాలు తెలిసాయి. ఓ యూట్యాబర్ ఆమెకు కాల్ చేసి ఎక్కడ ఉన్నది తెలుసుకున్నారు. తన ఫ్రెండ్‌కు యాక్సిడెంట్ కావటంతో తాను వరంగల్ వచ్చినట్లు బర్రెలక్క ఆ కాల్‌లో వెల్లడించారు. తన బెస్ట్ ఫ్రెండ్ యాక్సిడెంట్ గురి కావటంతో హుటహుటిన వరంగల్ వెళ్లాల్సి వచ్చిందన్నారు. హాస్పిటల్‌లో ఉండటం వల్లే ఎవరి ఫోన్ లిప్ట్ చేయలేకపోతున్నానని చెప్పారు. తాను మిస్సింగ్ అయ్యానన్న వార్తలు అవాస్తమని చెప్పారు. ఒకవేళ తాను మిస్ అయితే తన పేరెంట్స్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చేవారని తెలిపారు. తాను ఎక్కడికి వెళ్లలేదని కావాలనే తనపై కొందరు దుష్ర్పాచారం చేస్తున్నారన్నారు. ఇక తనకు ఏ రాజకీయ పార్టీల నుంచి ఆఫర్స్ రాలేదని కూడా చెప్పారు. తనకే గెలుపు అవకాశాలు ఉన్నాయని.. తాను ఖచ్చితంగా గెలుస్తానని తెలిపారు. తన ఎన్నికల ఖర్చుల కోసం తెలుగురాష్ట్రాల ప్రజలు పంపించిన విరాళాల వివరాలు కూడా వెల్లడించారు. ఇప్పటి వరకు ఎన్నికల ఖర్చుల కోసం రూ. 10 లక్షలు వచ్చినట్లు చెప్పారు. అందుకు సంబంధించిన బ్యాంకు స్టేట్‌మెంట్ కూడా ఉందని.. ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రెస్ మీట్‌పెట్టి వివరాలు వెల్లడిస్తానని అన్నారు.


Latest News
 

కడుపునొప్పి భరించలేక ఒకరు ఆత్మహత్య Sat, Oct 19, 2024, 02:48 PM
సబ్ స్టేషన్ కొరకు జోనల్ కమీషనర్ కు వినతి Sat, Oct 19, 2024, 02:45 PM
మానవ అక్రమ రవాణాను నిర్ములించాలి Sat, Oct 19, 2024, 02:12 PM
కుళ్లిపోయిన కూరగాయలతో ఆహార పదార్థాలు, చట్నీస్‌ రెస్టారెంట్‌పై కేసు నమోదు Sat, Oct 19, 2024, 02:00 PM
అకాల వర్షాలతో పత్తి పంట నష్టపోయిన రైతులకు అండగా బిఆర్ఎస్ పార్టీ Sat, Oct 19, 2024, 01:57 PM