మానవ అక్రమ రవాణాను నిర్ములించాలి

byసూర్య | Sat, Oct 19, 2024, 02:12 PM

నెక్కొండ మండల కేంద్రంలో ని పోలీస్ స్టేషన్ లో ఎస్. ఐ. మహేందర్ రెడ్డి చేతులమీదుగా వాక్ ఫర్ ఫ్రీడమ్ మరియు శ్రీ ధరణి స్వచ్చంద సేవ సంస్థ, హన్మకొండ వారి ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణా నిర్ములన పైన అవాగాహన నిమ్మిత్తం పోస్టర్ ఆవిష్కరిచడం జరిగింది.
ఈ సందర్బంగా సంస్థ జిల్లా కో ఆర్డినేటర్ ఈదునూరి రమేష్ మాట్లాడుతూ ఇప్పుడునున్న సమాజంలో అనేక ప్రాంతాలలో మానవ అక్రమ రవాణా ఘటణలు ఎక్కువయ్యాయి. సమాజంలో ఏర్పడకుండా నేరగాళ్లు రోజురోజుకి పెరిగిపోతున్నారు. ఇలాంటి పరిస్థితులు మళ్ళీ పునరావృత్తం కాకుండా ఉండటానికి మరియు విద్యార్థులల్లో, ప్రజలల్లో సరైన అవగాహన నిమ్మితం నేడు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టాము. రేపు అనగా నెక్కొండ మండల కేంద్రంలో అక్టోబర్ 19వ తేదీ 2024న మానవక్రమ రవాణా పై 200 మంది యువత, విద్యార్థిని విద్యార్థులతో అవగాహన ర్యాలీ మరియు మనవహారం నిర్వహించాలని వాక్ ఫర్ ఫ్రీడమ్ మరియు శ్రీ ధరణి స్వచ్చంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నాము.  పోలీసు విద్యా వైద్య మరియు  ప్రభుత్వ ప్రభుత్వవేతర సంస్థల సౌజన్యముతో అక్టోబర్ 19 ఉదయం 10 గంటలకు  విద్యార్థి విద్యార్థులతో ర్యాలీని నెక్కొండ పుర విధుల్లో నిర్వహించి అనంతరం 200 మందితో అంబేద్కర్ సెంటర్ కూడలిలో మానవహారం నిర్వహించాలని ముందస్తు సమాచారం పోలీస్ శాఖ వారికి ఈ సందర్బంగా తెలియజేయండం జరిగింది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ కానిస్టేబుల్స్ మోహన్, యాకమ్మ, సాయిరెడ్డిపల్లి మాజీ ఎం. పి. టి. సి. బండారుపల్లి శ్రీనివాస్, వెంకన్న, పోలీస్ శాఖ నుండి గౌతమ్, శ్రీలత, తిరుపతి, చైతన్య కుమార్, విజేందర్, నరేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

ఆందోళనలతో దద్దరిల్లిన ముత్యాలమ్మ టెంపుల్ ప్రాంగణం Sat, Oct 19, 2024, 05:08 PM
బండిసంజయ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు Sat, Oct 19, 2024, 05:03 PM
గంగాధర మండలంలో ఐకెపి కేంద్రాలు ప్రారంభించిన మేడిపల్లి సత్యం Sat, Oct 19, 2024, 04:59 PM
స్కాలర్ షిప్ లు ప్రభుత్వం భిక్ష కాదు Sat, Oct 19, 2024, 04:57 PM
బాధిత కుటుంబానికి సీఎం సహాయనిధి చెక్ అందజేసిన ఎమ్మెల్యే Sat, Oct 19, 2024, 04:54 PM