కాంగ్రెస్ హైకమాండ్ అలర్ట్,,,,రంగంలోకి దిగిన డీకే శివకుమార్,,,రిజల్ట్ రాగానే క్యాంపుకు తరలింపు

byసూర్య | Sat, Dec 02, 2023, 07:02 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. రేపు (డిసెంబర్ 3) ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కాంగ్రెస్ వైపు మెుగ్గుచూపాయి. ఆ పార్టీ పూర్తి మెజార్టీతో విజయం సాధిస్తుందని.. కొన్ని సంస్థలు వెల్లడించగా.. హంగ్ వస్తుందని మరికొన్ని ఎగ్జిట్ పోల్ సంస్థలు వెల్లడించాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. తాజా పరిస్థితులపై ఓ కన్నేసి ఉంచింది. ఎమ్మెల్యేలు చేజారిపోకుండా చర్యలు చేపట్టింది. ట్రబుల్ షూటర్‌గా పేరున్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను రంగంలోకి దింపింది. అధిష్టానం ఆదేశాలతో డీకే ఇవాళ హైదరాబాద్‌ రానున్నారు. ఎన్నికల ఫలితాల మానిటరింగ్ బాధ్యతలను ఆయనకు అప్పగంచారు.


నేటి నుంచి రెండు రోజుల పాటు తెలంగాణలోనే మ‌కాం వేయ‌నున్న డీకే... ఫలితాల తర్వాత అభ్యర్థులు చేజారిపోకుండా చర్యలు తీసుకోనున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య బొటాబొటీ ఫలితాలు వస్తే తమ పార్టీ ఎమ్మెల్యేలను బెంగుళూరు శివారులోని క్యాంపున‌కు తరలించేలా డీకే ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ప్రత్యేక విమానాల్లో, లేదంటే ప్రత్యేక బస్సుల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరు తరలించనున్నారు. కేసీఆర్ తమ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో సంప్రదింపులు జరుపుతున్నారని డీకే శివ కుమార్ ఆరోపిస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థులను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఆ సమాచారం మాకు ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు చేజారకుండా ఉండేందుకు కాంగ్రెస్ అదిష్ఠానం డీకేకు బాధ్యతలు అప్పగించింది. గెలుపు అవకాశాలున్న నేతలకు డీకే ఫోన్ చేసి టచ్‌లోకి వెళ్లినట్లు తెలిసింది. ఇలా పకడ్బందీ ఏర్పాట్లతో అభ్యర్థులు చేజారిపోకుండా కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఫలితాలు ఎలా వస్తాయి ? ఏ పార్టీకి మోజార్టీ వస్తుంది ? తర్వాత రాజకీయ పరిణామాలు ఏంటనేది ఆసక్తికరంగా మారింది.


Latest News
 

దసరా పండక్కి దుమ్మురేపిన ఆర్టీసీ.. కళ్లు చెదిరేలా ఆదాయం Fri, Oct 18, 2024, 10:54 PM
మండల ఉపాధ్యాయులకు పి ఆర్ టి యు సభ్యత్వం అందజేత Fri, Oct 18, 2024, 10:51 PM
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండ Fri, Oct 18, 2024, 10:49 PM
ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు Fri, Oct 18, 2024, 10:45 PM
గ్రామ సభల ద్వారానే ఇందిరమ్మ కమిటీలు వేయాలి Fri, Oct 18, 2024, 10:42 PM